అంకాలమ్మ ను దర్శించుకున్న మాజీ ఎమ్యెల్యే సతీమణి కదిరి రాణి
అంకాలమ్మ ను దర్శించుకున్న కదిరి రాణి
కనిగిరి ,మేజర్ న్యూస్ :
వరికుంటపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన అంకాలమ్మ దేవస్థానంలో ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమం జరిగింది .కనిగిరి మాజీ ఎమ్యెల్యే ,విశాఖపట్నం పార్లమెంట్ వైసీపి పరిశీలకులు కదిరి బాబురావు సతీమణి కదిరి రాణి అంకాలమ్మ,బంగారమ్మ ,పోలేరమ్మ ,పోతురాజు స్వామి వార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు .ఈ సంధర్భంగా దేవస్థానం కమిటీ వారు కదిరి రాణి ని అమ్మ వారి శేష వస్త్రంతో సత్కరించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు .ఈ కార్యక్రమంలో వరికుంటపాడు మాజీ ఎంపిపి సతీమణి సుంకర సృజన తదితరులు ఉన్నారు .