BREAKING
ఎన్నికల ప్రచారంలో ప్రజల మధ్య గుర్తించిన సమస్యలు.. పరిష్కారం దిశగా కార్యాచరణ ప్రస్థానం! ట్రాఫిక్ నియంత్రణకు అఖిలపక్ష సమావేశం మల్లన్న సాగర్ ముంపు బాధితులకు న్యాయం చేయాలి అంకాలమ్మ ను దర్శించుకున్న మాజీ ఎమ్యెల్యే సతీమణి కదిరి రాణి ఘనంగా 1995-96 ఎస్ఎస్‌సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. బోరంపల్లి టిడిపికి షాక్.. వైసీపీలో చేరిన సీనియర్ నాయకులు. దుబ్బాక నియోజకవర్గ రోడ్ల అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులు మంజూరు చేయండి రామాయణంలో సీత పాత్ర వివాదంపై స్పందించిన నితిష్ తివారీ: ప్రాచీన గ్రంథాల ఆధారంగా స్ట్రాంగ్ కౌంటర్! ప్రజాసేవే లక్ష్యం.. గ్రామాభివృద్ధే ధ్యేయం! టి. నరసాపురాన్ని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దుతా.. కూటమి సర్పంచ్ అభ్యర్థి చాట్రాతి యుగంధర్ హామీ.. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు భక్తిశ్రద్ధలతో లింబాద్రిగుట్టపై ధ్వజారోహణం జండా వీధిలో కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశం.. అబ్దుల్ అజీజ్‌కు ఘన సత్కారం వింజమూరు మండలంలో జోరుగా పంచాయతీ నామినేషన్లు ఉపాసన కొణిదెల ఆసక్తికర వ్యాఖ్యలు: పిల్లల పెంపకంలో సమానత్వంపై చర్చ! ఈఎంఆర్ఎస్ గాంధారి విద్యార్థుల ప్రతిభను అభినందించిన జిల్లా కలెక్టర్

10+2 విద్యా విధానం విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి

Select Suryaa Now
10+2 విద్యా విధానం విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి
సూర్య,భీమ్‌గల్ : తెలంగాణలో ప్రతిపాదిత నూతన 10+2 విద్యా విధానం విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ఉండాలని, అదే సమయంలో ప్రైవేట్ పాఠశాలల మనుగడకు రక్షణ కల్పించాలని బడ్జెట్ స్కూల్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఫౌండర్, భీంగల్ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ డైరెక్టర్ డాక్టర్ షఫీ షేక్ అన్నారు.2027–28 విద్యా సంవత్సరం నుంచి నూతన విద్యా నిర్మాణాన్ని అమలు చేయాలనే ప్రతిపాదన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం ఆహ్వానించదగిన విషయమే అయినప్పటికీ, వాటి అమలులో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాలల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు.
నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు ప్రాథమిక విద్య, ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకు మాధ్యమిక విద్య, తొమ్మిది నుంచి పన్నెండో తరగతి వరకు సీనియర్ సెకండరీ విద్యగా విభజించే ప్రతిపాదనపై ప్రభుత్వం సమగ్ర విధివిధానాలు రూపొందించాలని సూచించారు. ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యతో అనుసంధానించే క్రమంలో సిలబస్, పరీక్షల విధానం, విద్యార్థుల ఉన్నత విద్యా అవకాశాలపై స్పష్టత ఇవ్వాలన్నారు.ప్రస్తుతం తక్కువ ఫీజులతో విద్యాసేవలు అందిస్తున్న బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు కొత్త విధానం అమలుతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి రాకూడదన్నారు. 11, 12 తరగతుల నిర్వహణకు అవసరమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, అధ్యాపకుల నియామకం వంటి అంశాలపై పాఠశాలలకు తగిన గడువు, వెసులుబాటు కల్పించాలని కోరారు.అలాగే పాఠశాలల నిర్వహణ ఖర్చులు పెరిగే కారణంగా తల్లిదండ్రులపై అదనపు ఫీజుల భారం పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, ఇప్పటికే పనిచేస్తున్న వారికి కొత్త విధానానికి అనుగుణంగా శిక్షణ పొందేందుకు అవకాశం కల్పించాలని పేర్కొన్నారు.నీట్, జేఈఈ, ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసే విధానం, ఇంటర్మీడియట్ అధ్యాపకుల భవిష్యత్తు, పాఠశాలల గుర్తింపు, బోర్డు పరీక్షల నిర్వహణ వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని సూచించారు.విద్యా సంస్కరణల అమలుకు ముందు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘాలు, బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ప్రభుత్వం చర్చలు జరపాలని కోరారు. కొత్త విధానం అమలుకు సంబంధించిన సమగ్ర పాలసీ డాక్యుమెంట్‌ను ముందుగానే ప్రకటించి, దశలవారీగా అమలు చేయాలని అన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉండటం, తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకపోవడం, ప్రైవేట్ పాఠశాలల మనుగడకు రక్షణ కల్పించడం, ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించడం వంటి అంశాలే నూతన విద్యా విధానానికి ప్రధాన లక్ష్యాలుగా ఉండాలని డాక్టర్ షఫీ షేక్ అభిప్రాయపడ్డారు.