కంబాలపల్లిలో పాడి పశువులకు ముందస్తు టీకాలు
సదాశివపేట ; పాడి పశువులు ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామంలో పశువులకు వైద్య సిబ్బంది ఇంజక్షన్లు వేశారు. సీడీసీ చైర్మన్ గడిల రామ్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ ఇందూరి భారతమ్మ బాబు, గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సీడీసీ చైర్మన్ గడిల రామ్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే తమ బలమని, రైతుల కళ్లలో సంతోషం నింపడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పాడి పశువుల ఆరోగ్య పరిరక్షణకు రైతులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ముందస్తు వైద్య జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పశువులను అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కుమ్మరి పార్వతమ్మ ఆంజనేయులు, వార్డు సభ్యులు కుమ్మరి ఆంజనేయులు, బేలూరి ప్రభాకర్ రెడ్డి, పశువైద్య అధికారులు డి. సుజాత, జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ లింగయ్య, అటెండర్లు నిర్మల, కృష్ణ, గోపాలమిత్ర, గ్రామ పెద్దలు కుమ్మరి భగవంతు, కుమ్మరి కృష్ణ, నరసింహులు, ప్రభు, గొల్ల కృష్ణ, కుమ్మరి వినోద్, కుమ్మరి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.