BREAKING
ఎన్నికల ప్రచారంలో ప్రజల మధ్య గుర్తించిన సమస్యలు.. పరిష్కారం దిశగా కార్యాచరణ ప్రస్థానం! ట్రాఫిక్ నియంత్రణకు అఖిలపక్ష సమావేశం మల్లన్న సాగర్ ముంపు బాధితులకు న్యాయం చేయాలి అంకాలమ్మ ను దర్శించుకున్న మాజీ ఎమ్యెల్యే సతీమణి కదిరి రాణి ఘనంగా 1995-96 ఎస్ఎస్‌సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. బోరంపల్లి టిడిపికి షాక్.. వైసీపీలో చేరిన సీనియర్ నాయకులు. దుబ్బాక నియోజకవర్గ రోడ్ల అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులు మంజూరు చేయండి రామాయణంలో సీత పాత్ర వివాదంపై స్పందించిన నితిష్ తివారీ: ప్రాచీన గ్రంథాల ఆధారంగా స్ట్రాంగ్ కౌంటర్! ప్రజాసేవే లక్ష్యం.. గ్రామాభివృద్ధే ధ్యేయం! టి. నరసాపురాన్ని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దుతా.. కూటమి సర్పంచ్ అభ్యర్థి చాట్రాతి యుగంధర్ హామీ.. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు భక్తిశ్రద్ధలతో లింబాద్రిగుట్టపై ధ్వజారోహణం జండా వీధిలో కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశం.. అబ్దుల్ అజీజ్‌కు ఘన సత్కారం వింజమూరు మండలంలో జోరుగా పంచాయతీ నామినేషన్లు ఉపాసన కొణిదెల ఆసక్తికర వ్యాఖ్యలు: పిల్లల పెంపకంలో సమానత్వంపై చర్చ! ఈఎంఆర్ఎస్ గాంధారి విద్యార్థుల ప్రతిభను అభినందించిన జిల్లా కలెక్టర్

కోర్టు అభివృద్ధికి రూ.18.45 లక్షలు మంజూరు

Select Suryaa Now
కోర్టు అభివృద్ధికి రూ.18.45 లక్షలు మంజూరు
సూర్య,భీమ్‌గల్ : బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కృషితో భీమ్‌గల్ మండల కేంద్రంలోని కోర్టు ఆవరణ అభివృద్ధికి జిల్లా ఖనిజ నిధి (డీఎంఎఫ్) నుంచి రూ.18.45 లక్షలు మంజూరయ్యాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ తెలిపారు.ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠి ఈ నెల 4న పరిపాలనా అనుమతులు జారీ చేసినట్లు వెల్లడించారు. మండల పరిషత్ కార్యాలయం సమర్పించిన ప్రతిపాదనల మేరకు కోర్టు ఆవరణలో నాలుగు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.ఇందులో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం, షెడ్ ఏర్పాటు, విద్యుత్ సౌకర్యం కల్పనకు రూ.5 లక్షలు, మరో షెడ్ నిర్మాణానికి రూ.5 లక్షలు, గ్రావెల్ రోడ్డు, సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.5 లక్షలు, ప్రీకాస్ట్ ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.3.45 లక్షలు కేటాయించినట్లు తెలిపారు.మొత్తం రూ.18.45 లక్షలతో చేపట్టనున్న పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయినట్లు చెప్పారు. పనుల పురోగతిని అధికారులు పర్యవేక్షించడంతో పాటు ఖర్చుల వివరాలు, పనుల ఫొటోలను డీఎంఎఫ్ వెబ్ పోర్టల్‌లో నమోదు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు వివరించారు.భీమ్‌గల్ కోర్టు అభివృద్ధికి నిధులు మంజూరు చేయించడంలో ప్రత్యేక చొరవ చూపిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్‌, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లకు ఈ సందర్భంగా మల్లెల లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు.