నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జెసి
దేవనకొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రాన్ని మంగళవారం కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నురూల్ ఖమర్ ఆకస్మిక తనిఖీ చేశారు.నామినేషన్ కేంద్రం నందు వసతులను పరిశీలించి మండలంలో మొత్తం నామినేషన్ దాఖలు ఎన్ని వచ్చాయి అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థులకు సమయం కేటాయించి సహకరించాలని అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో యంపీడిఓ జ్యోతి. తహశీల్దార్ రామేశ్వర్ రెడ్డి, డిప్యూటీ యంపీడిఓ గోపాల్ పాల్గొన్నారు.