telangana
కొత్త పింఛన్లతో పేదలకు భరోసా - ధర్మారెడ్డిలో లబ్దిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ.
సూర్య, నాగిరెడ్డి పేట్ : అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించేలా ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం మండలంలోని ధర్మారెడ్డి గ్రామంలో నిర్వహించారు. స్థానిక ఎంపీడీవో గంగాధర్ సర్పంచ్ లక్ష్మీనారాయణ తో కలిసి లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులకు పింఛన్లు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని తెలిపారు. గతంలో రూ.200గా ఉన్న పింఛన్ను రూ.2,000కు పెంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. గ్రామంలో మొత్తం 17 మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన పింఛన్లు మంజూరైనట్లు సర్పంచ్ తెలిపారు. వితంతు పెన్షన్లు 10, దివ్యాంగుల పింఛన్ 3, గీతా కార్మికుల పింఛన్ 2, ఒంటరి మహిళల పెన్షన్ 2 ఆసరా పెన్షన్ లబ్ధి దారులకు మంజూరు పత్రాల పంపిణీ చేశారు.గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని సర్పంచ్ లక్ష్మీనారాయణ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధర్, గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ, ,ఉప సర్పంచ్ జయరాజ్, పంచాయతీ కార్యదర్శి రమేష్,వార్డ్ సభ్యులు,గ్రామ పెద్దలు దుర్గయ్య,శ్రీను, సాయిలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.