telangana
వానాకాలం ఖరీఫ్ 2026-27 ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం - పాల్గొన్న కలెక్టర్
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి : వానాకాలం (ఖరీఫ్) 2026-27 సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై గౌరవ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని, ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లను సకాలంలో పూర్తి చేసేలా సమన్వయంతో పనిచేయాలని, కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.అలాగే, కొనుగోలు కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ, రైతులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని అధికారులకు సూచించారు.ఈ సమీక్ష సమావేశంలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా పౌర సరఫరాల అధికారి డిసిఎస్ఓ, జిల్లా మేనేజర్ టీ జి ఎస్సి ఎస్సి ఎల్ స్టేట్ వారేహౌజ్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.