శ్రీ అలగనాథస్వామి దేవస్థానంలో వైభవంగా కార్తీక ఆకాశ దీపోత్సవం, స్వామివారి కల్యాణ మహోత్సవం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలగనాథస్వామి దేవస్థానంలో సోమవారం రాత్రి కార్తీక సోమవారం, కోటి సోమవారం, శ్రవణ నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని కార్తీక ఆకాశ దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్తీక మాస ప్రారంభం నుంచి ప్రతిరోజూ ఆలయంలో జరుగుతున్న ఆకాశ దీపోత్సవానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆత్మకూరు పట్టణంలో అలగనాథస్వామి ఆలయంలో జరిగే ఆకాశ దీపోత్సవం ప్రత్యేకతగా నిలుస్తుండటంతో మహిళా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి స్వయంగా దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.
అదేవిధంగా శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివార్ల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి గానాల మధ్య స్వామివారి కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించి స్వామివారి కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా జరిపించారు. అనంతరం ఉభయదాతల ఆధ్వర్యంలో భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ రెండు పవిత్ర కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణమంతా భక్తుల కోలాహలంతో, ఆధ్యాత్మిక ఆనందోత్సాహాలతో కళకళలాడింది. భక్తుల విశేష పాల్గొనడం, మహిళల భక్తిశ్రద్ధలు ఈ కార్యక్రమాలకు మరింత శోభను చేకూర్చాయి.
భక్తులందరి సహాయ సహకారాలతో రాబోయే రోజులలో మన దేవస్థానంలో నిర్వహించబోయే అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భక్తులందరూ ఇదే విధంగా అధిక సంఖ్యలో విచ్చేసి, స్వామివారి సేవలో పాల్గొని, కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా ఆలయ కమిటీ తరఫున మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామని,శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలగనాథస్వామివారి దివ్య మంగళ ఆశీస్సులు భక్తులందరిపై ఎల్లవేళలా ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సకల శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ అలఘనాధ స్వామి
ఆలయ కమిటీ మరియు అర్చక స్వాములు పేర్కొన్నారు.