పొట్లమర్రి పంచాయితీ లో తెదేపా హవా. గంటాపురం పరిధిలో ఆరు వార్డులు ఏకగ్రీవం
బత్తులపల్లి మేజర్: సత్య సాయి జిల్లా బత్తలపల్లి మండలం పొట్లమారి పంచాయతీ పరిధిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సత్తా చాటాయి. పొట్లమర్ర పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి నెట్టెం శకుంతలమ్మ నాయకత్వంలో స్థానిక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
గంటాపురం గ్రామ పరిధిలోని మొత్తం ఆరు వార్డులకు సంబంధించి తెదేపా బలపరిచిన అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. ప్రతిపక్షాల నుంచి సరైన నామినేషన్లు దాఖలు కాకపోవడంతో, గంటాపురం ఆరు వార్డులు కూడా ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు.
స్థానిక సర్పంచ్ అభ్యర్థి నెట్టెం శకుంతలమ్మ వ్యూహం, గ్రామస్తుల సంపూర్ణ మద్దతుతోనే ఈ ఏకగ్రీవం సాధ్యమైందని తెదేపా శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ప్రారంభ దశలోనే వార్డులు ఏకగ్రీమం కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.