BREAKING
ఈ నెల 18న ఎమ్మెల్యే చే లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ - ఎంపీడీవో ఉమర్ షరీఫ్ ఢిల్లీలో మహా ప్రదర్శన జయప్రదం చేయండి. సిఐటియు కేజీబీవీ కాశీపూర్‌ను సందర్శించిన జీఈసీఓ బృందం రైతులు పశుగ్రాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి - పశు వైద్యాధికారి డాక్టర్ కస్తూరి శ్రీకాంత్ పొదలకూరు మండలంలోని పలు హాస్టళ్లలో దోమతెరల పంపిణీ ఫిల్టర్ బెడ్ల వద్ద రాత్రి వేళ సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలి - సీఐటీయూ నాయకులు వైద్య కార్యక్రమాల పోస్టర్లు, కరపత్రాలు విడుదల చేసిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ విద్యార్థులకు వృత్తి నైపుణ్యాలపై అవగాహన ధాన్యం కొనుగోళ్ల కేంద్రాన్ని సందర్శించిన తాసిల్దార్ వహీదా, ఏవో జెన్నీ. మహాసభల ప్రచార కరపత్రాలు, పోస్టర్ల ఆవిష్కరణ విజనరీ 2026 నేషనల్ అవార్డు గ్రహీత నార్ని అమరచంద్ వశిష్ట రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో కంప్యూటర్ ప్రింటర్ అందజేత ఆత్మకూరు ప్రాదేశిక ప్రతినిధుల ప్రమాణ స్వీకారం రేపే --ఎంపిపి, వైస్ ఎంపిపి ఎన్నిక బియ్యం ధరల కృత్రిమ పెంపు.. అక్రమ నిల్వలపై కొరడా ఝళిపించాలి శ్రీ అలగనాథస్వామి దేవస్థానంలో వైభవంగా కార్తీక ఆకాశ దీపోత్సవం, స్వామివారి కల్యాణ మహోత్సవం

బియ్యం ధరల కృత్రిమ పెంపు.. అక్రమ నిల్వలపై కొరడా ఝళిపించాలి

Select Suryaa Now
బియ్యం ధరల కృత్రిమ పెంపు.. అక్రమ నిల్వలపై కొరడా ఝళిపించాలి

సూర్య- బిక్కనూర్ : జిల్లాలో బియ్యం ధరల కృత్తిమ పెంపు అక్రమ నిలువలపై అధికారులు దృష్టి సారించి,కొరడా ఝళిపించాలని,నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ కంట్రోల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా  రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్ మంగళవారం జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో బియ్యం కిలో రూ.90 నుంచి రూ.130 వరకు విక్రయిస్తున్నారని, దీంతో సామాన్యులపై భారం పెరుగుతుందని, బియ్యం అక్రమ నిల్వలపై చర్యలు తీసుకోవాలని,ఎల్‌నినో పరిస్థితులను సాకుగా చూపుతూ కొందరు పెద్ద వ్యాపారులు, రైస్ మిల్లర్లు సన్నబియ్యం రకాల కొరతను కృత్రిమంగా సృష్టించి ధరలను ఇష్టానుసారంగా పెంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం బీపీటీ/కేఎన్ఎం బియ్యం కిలో రూ.66, ఆర్ఎన్ఆర్ రూ.74, హెచ్‌ఎంటీ రూ.79 ఉండాల్సి ఉండగా, కొన్ని ప్రాంతాల్లో కిలో రూ.90 నుంచి రూ.130 వరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా నాణ్యత లేని ఇతర రకాల బియ్యాన్ని ప్రీమియం సన్నబియ్యం పేరుతో విక్రయిస్తున్నారని, రైస్ మిల్లులు, గోదాముల్లో భారీగా నిల్వలు ఉంచి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని వివరించారు. జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లులు, గోదాములు, హోల్‌సేల్ వ్యాపార కేంద్రాలపై విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ బృందాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమ నిల్వలను గుర్తించాలని, నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులు, మిల్లర్లపై నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ధరలకు అనుగుణంగా నాణ్యమైన బియ్యం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టడంతో పాటు, రైస్ మిల్లులు, సహకార విక్రయ కేంద్రాలు లేదా ప్రత్యేక రిటైల్ కౌంటర్ల ద్వారా సరసమైన ధరలకు బియ్యం విక్రయించే ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రోజువారీ కూలీలు, పేద, మధ్యతరగతి కుటుంబాలపై ధరల భారం పడకుండా తక్షణమే స్పందించి వినియోగదారులకు న్యాయం చేయాలని డీసీఎస్‌వోను కోరినట్లు శ్రీరామ్ వెంకటేష్ తెలిపారు.