telangana
రైతులు పశుగ్రాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి - పశు వైద్యాధికారి డాక్టర్ కస్తూరి శ్రీకాంత్
సూర్య, జన్నారం : రైతులు ప్రభుత్వం అమలు చేస్తున్న పశుగ్రాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల పశు వైద్యాధికారి డాక్టర్ కస్తూరి శ్రీకాంత్ కోరారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో పశువులకు పచ్చిమేత కొరత ఏర్పడకుండా పశుసంపదను కాపాడడంతో పాటు రైతులకు పంపించాలని కల్పించాలని లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పశుగ్రాసం సాగును ప్రోత్సహిస్తుందని , వ్యవసాయ పొలాల్లో పశుగ్రాసం సాగు చేస్తే ఎకరానికి 14 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. రైతులు తమకున్న సాగుభూములు పశుగ్రాసం పండించడం ద్వారా పశువులకు ఏడాది పొడవునా నాణ్యమైన మేత అందించడంతోపాటు పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకానికి అర్హులైన రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, ఉపాధి హామీ జాబు కార్డుతో పశువైద్య కార్యాలయంలో ఆ పత్రాలను అందజేయాలన్నారు.