ఢిల్లీలో మహా ప్రదర్శన జయప్రదం చేయండి. సిఐటియు
ఢిల్లీలో మహా ప్రదర్శన జయప్రదం చేయండి - సిఐటియు.
హిందూపురం టౌన్ మేజర్ న్యూస్:
కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలపై డిసెంబర్ 1 నుండి 3 వరకు ఢిల్లీలో జరగనున్న మహా ప్రదర్శన, నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ హిందూపురం వ్యవసాయ మార్కెట్ లో సిఐటియు నాయకులు పోస్టర్లు విడుదల చేశారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు జడ్పీ శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు వి.ఆర్. రాము మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లయినా కార్మికుల వేతనాలు, పెన్షన్లలో ఎదుగుదల లేదని, దేశ సంపదలో 40% ఒక శాతం సంపన్నుల వద్దే పోగుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో ఐదు మండలాల్లో గార్మెంట్స్ పరిశ్రమల్లో పనిచేసే సుమారు 25 వేల మంది మహిళా కార్మికులకు సామాజిక భద్రత లేదని, 15 ఏళ్లుగా కనీస వేతనాలు, డీఏ, ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు వేధిస్తున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ హమాలీ కార్మికులు అస్లాం, భక్తర్, మస్తాన్, అతావుల్లా, రఫిక్, బాబా, మెహర్, శివకుమార్, వెంకటేష్, నాగమ్మ, వరలక్ష్మి, నాగలక్ష్మి, వసంత తదితరులు పాల్గొన్నారు.
నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ నాగరాజు, హిందూపురం