BREAKING
ఈ నెల 18న ఎమ్మెల్యే చే లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ - ఎంపీడీవో ఉమర్ షరీఫ్ ఢిల్లీలో మహా ప్రదర్శన జయప్రదం చేయండి. సిఐటియు కేజీబీవీ కాశీపూర్‌ను సందర్శించిన జీఈసీఓ బృందం రైతులు పశుగ్రాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి - పశు వైద్యాధికారి డాక్టర్ కస్తూరి శ్రీకాంత్ పొదలకూరు మండలంలోని పలు హాస్టళ్లలో దోమతెరల పంపిణీ ఫిల్టర్ బెడ్ల వద్ద రాత్రి వేళ సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలి - సీఐటీయూ నాయకులు వైద్య కార్యక్రమాల పోస్టర్లు, కరపత్రాలు విడుదల చేసిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ విద్యార్థులకు వృత్తి నైపుణ్యాలపై అవగాహన ధాన్యం కొనుగోళ్ల కేంద్రాన్ని సందర్శించిన తాసిల్దార్ వహీదా, ఏవో జెన్నీ. మహాసభల ప్రచార కరపత్రాలు, పోస్టర్ల ఆవిష్కరణ విజనరీ 2026 నేషనల్ అవార్డు గ్రహీత నార్ని అమరచంద్ వశిష్ట రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో కంప్యూటర్ ప్రింటర్ అందజేత ఆత్మకూరు ప్రాదేశిక ప్రతినిధుల ప్రమాణ స్వీకారం రేపే --ఎంపిపి, వైస్ ఎంపిపి ఎన్నిక బియ్యం ధరల కృత్రిమ పెంపు.. అక్రమ నిల్వలపై కొరడా ఝళిపించాలి శ్రీ అలగనాథస్వామి దేవస్థానంలో వైభవంగా కార్తీక ఆకాశ దీపోత్సవం, స్వామివారి కల్యాణ మహోత్సవం

ఆత్మకూరు ప్రాదేశిక ప్రతినిధుల ప్రమాణ స్వీకారం రేపే --ఎంపిపి, వైస్ ఎంపిపి ఎన్నిక

Select Suryaa Now
ఆత్మకూరు ప్రాదేశిక ప్రతినిధుల ప్రమాణ స్వీకారం రేపే  --ఎంపిపి, వైస్ ఎంపిపి ఎన్నిక

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :    ఆత్మకూరు మండలంలో జరిగిన ఎంపిటిసి ఎన్నికల్లో కూటమి ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అందరు గెలుపొంది ప్రభంజనం సృష్టించారు. ఈనెల 19వతేదీ జెడ్పిటిసి, ఎంపిటిసి సభ్యులుగా విజయం సాధించిన వారందరూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం మండలాధ్యక్షుని, ఉప మండలాధ్యక్షుని ఎన్నిక జరుగనుంది. మండల జెడ్పిటిసి మెంబర్ గా టిడిపి తరపున పోటీ చేసిన డాక్టర్ తూమాటి శశిధర్ రెడ్డి విజయం సాధించారు.మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలు ఉండగా చెర్లోఎడవల్లి ఎంపిటిసి స్థానం నుండి మాజీ మండలాధ్యక్షుడు కేతా వేణుగోపాల్ రెడ్డి ఏకగ్రీవంగా తెలుగుదేశం అభ్యర్థిగా ఎన్నికయ్యారు. మిగతా ఎనిమిది చోట్ల ఎన్నికలు జరిగాయి. ఏడు మంది టిడిపి తరపున, ఒక్కరు వైసీపీ తరపున గెలుపొందారు.వాసిలి ఎంపిటిసి స్థానం నుండి తెలుగుదేశం అభ్యర్థి మామిడి చందన విజయం సాధించారు. అప్పారావు పాలెం ఎంపీటీసీ స్థానం నుండి తెలుగుదేశం అభ్యర్థి బొమ్మతోటి ఇందిరమ్మ విజయం సాధించారు. బట్టేపాడు ఎంపీటీసీ స్థానం నుండి తెలుగుదేశం అభ్యర్థి వీరదిమ్మ గీతమ్మ విజయం సాధించారు.కరటంపాడు ఎంపిటిసి స్థానం నుండి తెలుగుదేశం తరపున దావా సుమన్య విజయం సాధించారు.నువ్వురుపాడు ఎంపీటీసీ స్థానం నుండి తెలుగుదేశం అభ్యర్థి షేక్ ఖాజావలి  విజయం సాధించారు. మురుగుళ్ల ఎంపీటీసీ తెలుగుదేశం అభ్యర్థి పువ్వాడ వెంకటేశ్వర్లు విజయం సాధించారు. పడకండ్ల ఎంపీటీసీ స్థానం నుండి తెలుగుదేశం అభ్యర్థి కొల్లి నరసయ్య నాయుడు  విజయం సాధించారు.  మహిమలూరు ఎంపిటిసి స్థానం నుండి వైసీపీ తరపున పోటీ చేసిన శామనబోయిన సుజాత విజయం సాధించారు.వారంతా ఈనెల 19వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి ఎంపిపి, వైస్ ఎంపిపి లను ఎన్నుకొనున్నారు. ఎంపిపి పదవి విషయమై వాసిలి చందన, కరటంపాడు సుమన్య, అప్పారావుపాలెం ఇందిరమ్మ రేసులో ఉన్నారు. ఎవరు ఎంపిపి అవుతారా అనేది ఉత్కంటభరితంగా ఉంది.