కేజీబీవీ కాశీపూర్‌ను సందర్శించిన జీఈసీఓ బృందం
కంది ; కంది మండల పరిధిలోని కాశీపూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) జీఈసీఓ సునీత ఖన్నా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మౌలిక వసతులు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యా కార్యక్రమాలు, బోధనా విధానం, విద్యార్థుల అభ్యసన వాతావరణాన్ని పరిశీలించారు.అనంతరం పాఠశాల సిబ్బందితో మాట్లాడి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, విద్యా కార్యక్రమాల అమలు తీరుపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల సంక్షేమం, విద్యా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రత్యేక అధికారి బి. మీరాబాయి మాట్లాడుతూ.. కేజీబీవీని సందర్శించి విద్యార్థుల సంక్షేమం, అభివృద్ధిపై ఆసక్తి చూపిన జీఈసీఓ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.