BREAKING
ఈ నెల 18న ఎమ్మెల్యే చే లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ - ఎంపీడీవో ఉమర్ షరీఫ్ ఢిల్లీలో మహా ప్రదర్శన జయప్రదం చేయండి. సిఐటియు కేజీబీవీ కాశీపూర్‌ను సందర్శించిన జీఈసీఓ బృందం రైతులు పశుగ్రాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి - పశు వైద్యాధికారి డాక్టర్ కస్తూరి శ్రీకాంత్ పొదలకూరు మండలంలోని పలు హాస్టళ్లలో దోమతెరల పంపిణీ ఫిల్టర్ బెడ్ల వద్ద రాత్రి వేళ సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలి - సీఐటీయూ నాయకులు వైద్య కార్యక్రమాల పోస్టర్లు, కరపత్రాలు విడుదల చేసిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ విద్యార్థులకు వృత్తి నైపుణ్యాలపై అవగాహన ధాన్యం కొనుగోళ్ల కేంద్రాన్ని సందర్శించిన తాసిల్దార్ వహీదా, ఏవో జెన్నీ. మహాసభల ప్రచార కరపత్రాలు, పోస్టర్ల ఆవిష్కరణ విజనరీ 2026 నేషనల్ అవార్డు గ్రహీత నార్ని అమరచంద్ వశిష్ట రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో కంప్యూటర్ ప్రింటర్ అందజేత ఆత్మకూరు ప్రాదేశిక ప్రతినిధుల ప్రమాణ స్వీకారం రేపే --ఎంపిపి, వైస్ ఎంపిపి ఎన్నిక బియ్యం ధరల కృత్రిమ పెంపు.. అక్రమ నిల్వలపై కొరడా ఝళిపించాలి శ్రీ అలగనాథస్వామి దేవస్థానంలో వైభవంగా కార్తీక ఆకాశ దీపోత్సవం, స్వామివారి కల్యాణ మహోత్సవం

గోమాతల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత - హనుమాన్‌ గోశాల, క్షత్రియ పాఠశాలలో ప్రత్యేక పూజలు

Select Suryaa Now
గోమాతల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత - హనుమాన్‌ గోశాల, క్షత్రియ పాఠశాలలో ప్రత్యేక పూజలు
సూర్య, ఆర్మూర్‌ : ఆర్మూర్‌ పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ గోశాల, క్షత్రియ పాఠశాలలో గోపాష్టమి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా గోమాతలకు ప్రత్యేక పూజలు చేసి, వాటి ప్రాముఖ్యతను వివరించారు.హిందూ సంప్రదాయం ప్రకారం కార్తీక మాసం శుక్లపక్ష అష్టమి రోజును గోపాష్టమిగా జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు ఐదేళ్ల వయస్సు నిండిన తర్వాత తొలిసారిగా అన్న బలరాముడితో కలిసి గోవులను మేపడానికి అడవికి వెళ్లిన రోజుగా ఈ పర్వదినానికి పురాణాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఘట్టాన్ని గోచరణ లీలగా పేర్కొంటారు. గోవర్ధన గిరిని ఎత్తి గోవులను, బృందావన ప్రజలను శ్రీకృష్ణుడు రక్షించిన ఘట్టాన్ని కూడా ఈ పర్వదినంతో అనుసంధానించి భక్తులు స్మరించుకుంటారు.హిందూ ధర్మంలో గోవును గోమాతగా భావించి పూజిస్తారని, గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారనే విశ్వాసం ఉందని నిర్వాహకులు తెలిపారు. గోమాతను పూజించడం మాత్రమే కాకుండా వాటికి ఆహారం అందించడం, సంరక్షించడం, సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. గోరక్షణ, గోసేవ భారతీయ సంస్కృతిలో అంతర్భాగమని, ప్రతి ఒక్కరూ గోవుల సంరక్షణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మి, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, జిల్లా విశేష సంపర్క ప్రముఖ్ అల్జపూర్ అక్షయ్, నగర కార్యదర్శి కొంగి రవి, ఉపాధ్యక్షుడు గంజాల ప్రేమ్, సహ కార్యదర్శి కరణ్, సురక్ష ప్రముఖ్ ప్రవీణ్, సత్సంగ్ ప్రముఖ్ సచిన్, బలోపాసన ప్రముఖ్ సాయి, సప్తాహిక్ మిలన్ అరవింద్, నరేందర్, శ్రవీణ్, మహిళలు, పిల్లలు, కార్యకర్తలు పాల్గొన్నారు.