పిఎసిఎస్ డైరెక్టర్ ను సన్మానించిన గ్రామస్తులు
సూర్య- బిక్కనూర్ : మండలంలోని కంచర్ల గ్రామానికి చెందిన పెంటల నర్సాగౌడ్ పెద్దమల్లారెడ్డి పిఎసిఎస్ సొసైటీ డైరెక్టర్‌గా ఎన్నికైన సందర్భంగా మంగళవారం గ్రామస్తులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామానికి చెందిన వ్యక్తికి సొసైటీ డైరెక్టర్ గా నియమించడం అభినందనీయమన్నారు. నర్సాగౌడ్ రైతుల సంక్షేమానికి కృషిచేసి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు