telangana
చేయూత పెన్షన్లకు కృతజ్ఞతగా పాలాభిషేకం
సూర్య రాజంపేట : రాజంపేట మండలంలోని అర్గోండ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న చేయూత పెన్షన్లకు కృతజ్ఞతగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. చేయూత పెన్షన్లతో వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కలుగుతోందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎర్ర విక్రాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ తుల రవి, కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, పెన్షన్ లబ్ధిదారులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.