BREAKING
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి - సోషల్ వెల్ఫేర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వైసిపి ప్రజాప్రతినిధులు ఆశీస్సులు తీసుకున్న జి మధు రెడ్డి పిఎసిఎస్ డైరెక్టర్ ను సన్మానించిన గ్రామస్తులు టీఆర్ఎస్ పార్టీ రైతు కమిటీ అధ్యక్షుడిగా గోవర్ధన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలి – మంత్రి ఆనం రామనారాయణరెడ్డి 0 శాతం ఫిట్‌మెంట్‌తో పిఆర్సి అమలు చేయాలి - మర్రి అవినాష్ కోటంరెడ్డి సోదరులతో భేటీ అయిన మంత్రి ఆనం పేదరికం చదువుకు అడ్డు కాదు - ఒకే కుటుంబంలో ముగ్గురు వైద్యులు ఎన్నికల వేళ పోలీసుల విస్తృత తనిఖీలు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేతులమీదుగా నూతన పెన్షన్ ఉత్తర్వులు పంపిణీ ధారూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు శ్రీ చైతన్య విద్యార్థి ఎంపిక సగం సీజన్ ముగిసినా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించరా? - బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి టాటా బిల్డింగ్ ఇండియా స్కూల్ ఎస్సే కాంపిటీషన్ – 2026లో అగ్రస్థానాలను కైవసం చేసుకున్న అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఎంపీపీ, జెడ్పీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

విద్యార్థులకు దోమతెరల పంపిణీ దోమల ద్వారా వ్యాపించే సీజనల్ వ్యాధులపై అవగాహన

Select Suryaa Now
విద్యార్థులకు దోమతెరల పంపిణీ  దోమల ద్వారా వ్యాపించే సీజనల్ వ్యాధులపై అవగాహన

కలిగిరి,  మేజర్ న్యూస్  :    జిల్లా మలేరియా అధికారి ఎం. సింహాచలం ఆదేశాల మేరకు కలిగిరి మండలంలోని ఏపీ మోడల్ స్కూల్, కస్తూరిబా విద్యాలయంలో విద్యార్థులకు దోమతెరలు పంపిణీ చేశారు. డాక్టర్ ఆకాశ్ రెడ్డి చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా డాక్టర్ ఆకాశ్ రెడ్డి విద్యార్థులకు దోమతెరల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. దోమల కాటు నుంచి రక్షణ పొందేందుకు దోమతెరలను తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇళ్ల వద్ద నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని విద్యార్థులకు సూచించారు.  దోమల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఆరోగ్య పరిరక్షణపై చిన్నతనం నుంచే అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ లక్ష్మీప్రసాద్, ఏఎన్ఎంలు శిరీష, బి. లక్ష్మి, ఎంఎల్‌హెచ్‌పీ స్రవంతి, ఆశా కార్యకర్తలు గౌస్య, నాగమణి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.