సూర్య తిమ్మాపూర్ : శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సీఎస్ఈ (ఏఐ అండ్ ఎంఎల్) మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కే. అభిలాష్ రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యాడు. బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 21 నుంచి 24 వరకు హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో నిర్వహించనున్న జూనియర్ స్థాయి రాష్ట్ర పోటీల్లో అభిలాష్ పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి విద్యార్థిని అభినందించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శశికాంత్ మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులకు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం లభిస్తుందని, అభిలాష్ జాతీయస్థాయి పోటీలకు కూడా ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల పాలనాధికారి పారువెల్ల రామారావు, ఫిజికల్ డైరెక్టర్లు పి. సునీత, దుర్గారాజ్ సింగ్, మీడియా ఇన్‌చార్జి గొంటి రమేష్, అధ్యాపకులు పాల్గొని అభిలాష్‌కు అభినందనలు తెలిపారు.