BREAKING
రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో కంప్యూటర్ ప్రింటర్ అందజేత ఆత్మకూరు ప్రాదేశిక ప్రతినిధుల ప్రమాణ స్వీకారం రేపే --ఎంపిపి, వైస్ ఎంపిపి ఎన్నిక బియ్యం ధరల కృత్రిమ పెంపు.. అక్రమ నిల్వలపై కొరడా ఝళిపించాలి శ్రీ అలగనాథస్వామి దేవస్థానంలో వైభవంగా కార్తీక ఆకాశ దీపోత్సవం, స్వామివారి కల్యాణ మహోత్సవం ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ నియోజకవర్గంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి - టిడిపి పరిశీలకులు మోహన్ రెడ్డి గోమాతల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత - హనుమాన్‌ గోశాల, క్షత్రియ పాఠశాలలో ప్రత్యేక పూజలు విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా దోమతెరల పంపిణీ - ఆరోగ్య అవగాహన కార్యక్రమం చేయూత పెన్షన్లకు కృతజ్ఞతగా పాలాభిషేకం పొట్లమర్రి పంచాయితీ లో తెదేపా హవా. గంటాపురం పరిధిలో ఆరు వార్డులు ఏకగ్రీవం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి - సోషల్ వెల్ఫేర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వైసిపి ప్రజాప్రతినిధులు ఆశీస్సులు తీసుకున్న జి మధు రెడ్డి పిఎసిఎస్ డైరెక్టర్ ను సన్మానించిన గ్రామస్తులు టీఆర్ఎస్ పార్టీ రైతు కమిటీ అధ్యక్షుడిగా గోవర్ధన్ రెడ్డి

టాటా బిల్డింగ్ ఇండియా స్కూల్ ఎస్సే కాంపిటీషన్ – 2026లో అగ్రస్థానాలను కైవసం చేసుకున్న అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు

Select Suryaa Now
టాటా బిల్డింగ్ ఇండియా స్కూల్ ఎస్సే కాంపిటీషన్ – 2026లో అగ్రస్థానాలను కైవసం చేసుకున్న అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు
సూర్య కరీంనగర్ : కరీంనగర్‌లోని అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు టాటా బిల్డింగ్ ఇండియా స్కూల్ ఎస్సే కాంపిటీషన్ – 2026లో అద్భుత ప్రతిభ కనబరిచి, సీనియర్, మిడిల్ స్కూల్ విభాగాల్లోని ఆరు అగ్రస్థానాలను కైవసం చేసుకుని గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది.“2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు నేను చేయబోయే ఐదు పనులు” అనే స్ఫూర్తిదాయక అంశంపై ఈ పోటీ నిర్వహించబడింది. ఇది ‘వికసిత్ భారత్ 2047’ జాతీయ దార్శనికతకు అనుగుణంగా సాగింది. యువ పౌరులుగా తమ బాధ్యతలను గుర్తించి, దేశ భవిష్యత్తు అభివృద్ధికి తమ వంతు కృషిపై ఆలోచనలను వ్యక్తపరిచేలా విద్యార్థులను ప్రోత్సహించింది.సీనియర్ స్కూల్ విభాగంలో వై. విశ్వక్ సేన్ (గ్రేడ్ 10) ఫస్ట్ ప్లేస్, వి. శ్రేయస్ (గ్రేడ్ 9) సెకండ్ ప్లేస్, ఛ. విద్యా దీప్తి (గ్రేడ్ 9) థర్డ్ ప్లేస్ సాధించారు. మిడిల్ స్కూల్ విభాగంలో ఎం. రిషిక (గ్రేడ్ 6) ఫస్ట్ ప్లేస్, ఈ. సహస్ర (గ్రేడ్ 8) సెకండ్ ప్లేస్, టి. హృతిక (గ్రేడ్ 7) థర్డ్ ప్లేస్ సాధించారు.ఈ విజయానికి మార్గదర్శకత్వం వహించిన ఇంగ్లీష్ ఫెసిలిటేటర్స్ ఆర్య,నమీరాలకు పాఠశాల ప్రత్యేక అభినందనలు తెలియజేసింది.డైరెక్టర్ అనుదీప్ సౌగాని  విద్యార్థులను, ఫెసిలిటేటర్లను అభినందిస్తూ, ఆత్మవిశ్వాసం, బాధ్యతాయుతమైన ఆలోచనలు, దూరదృష్టి కలిగిన యువ పౌరులను తీర్చిదిద్దాలనే తన విద్యా దార్శనికతను పునరుద్ఘాటించారు. ప్రిన్సిపాల్,వైస్ ప్రిన్సిపాల్ విద్యార్థుల విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ, అభివృద్ధి చెందిన భారతదేశం అనే కల మన యువత ఆలోచనలు, విలువలు, కార్యాచరణతోనే సాకారమవుతుందని పేర్కొన్నారు.