telangana
0 శాతం ఫిట్‌మెంట్‌తో పిఆర్సి అమలు చేయాలి - మర్రి అవినాష్
సూర్య జమ్మికుంట : జమ్మికుంట మండలంలో టిపిటిఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టిపిటిఎఫ్ కరీంనగర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మర్రి అవినాష్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఉద్యోగులకు 50 శాతం ఫిట్‌మెంట్‌తోనే పిఆర్సి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న డిఏలు మంజూరు చేయాలని, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. సిపిఎస్‌ను ఓపిఎస్‌గా మార్చాలని, కేజీబీవీ మరియు మోడల్ స్కూల్ ఉద్యోగుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని అన్నారు.ఈహెచ్‌ఎస్ ఎంప్లాయిస్ హెల్త్ స్కీంలోని లోపాలను సవరించి, నగదు రహిత చికిత్సను అన్ని కార్పోరేట్ హాస్పిటళ్లలో అందజేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను డిఎస్సి ద్వారా భర్తీ చేసి, అన్ని క్యాడర్లలో ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట మండల టిపిటిఎఫ్ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొండపాక తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా కోడికూటి తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ సీనియర్ కార్యకర్తలు పాక కుమారస్వామి, రామస్వామి, బాబన్న, సారభద్రస్వామి తదితరులు పాల్గొన్నారు.