BREAKING
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి - సోషల్ వెల్ఫేర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వైసిపి ప్రజాప్రతినిధులు ఆశీస్సులు తీసుకున్న జి మధు రెడ్డి పిఎసిఎస్ డైరెక్టర్ ను సన్మానించిన గ్రామస్తులు టీఆర్ఎస్ పార్టీ రైతు కమిటీ అధ్యక్షుడిగా గోవర్ధన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలి – మంత్రి ఆనం రామనారాయణరెడ్డి 0 శాతం ఫిట్‌మెంట్‌తో పిఆర్సి అమలు చేయాలి - మర్రి అవినాష్ కోటంరెడ్డి సోదరులతో భేటీ అయిన మంత్రి ఆనం పేదరికం చదువుకు అడ్డు కాదు - ఒకే కుటుంబంలో ముగ్గురు వైద్యులు ఎన్నికల వేళ పోలీసుల విస్తృత తనిఖీలు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేతులమీదుగా నూతన పెన్షన్ ఉత్తర్వులు పంపిణీ ధారూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు శ్రీ చైతన్య విద్యార్థి ఎంపిక సగం సీజన్ ముగిసినా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించరా? - బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి టాటా బిల్డింగ్ ఇండియా స్కూల్ ఎస్సే కాంపిటీషన్ – 2026లో అగ్రస్థానాలను కైవసం చేసుకున్న అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఎంపీపీ, జెడ్పీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాలచెంత కార్తీక దీపోత్సవ కార్యక్రమం - ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Select Suryaa Now
ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాలచెంత కార్తీక దీపోత్సవ కార్యక్రమం - ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ :  నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 56వ డివిజన్ గణేష్ ఘాట్ వద్ద ఈ నెల 24వ తేదీ జరిగే మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను  రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, సింహపురి కార్తీక దీపోత్సవ సమితి సభ్యులతో కలిసి మంగళవారం పరిశీలించారు. సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహాదీపోత్సవ కార్యక్రమం ఏర్పాట్లకు స్థానిక శాసనసభ్యుడిగా నా సంపూర్ణ మద్దతు ఎప్పుడు ఉంటుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు . నవంబర్ 24వ తేదీ సాయంత్రం 5 గంటలకు అందరూ కుటుంబసభ్యులతో విచ్చేసి గణేష్ ఘాట్ లో జరిగే మహాకార్తీక దీపోత్సవంలో పాల్గొనండి అని  రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు . నవంబర్ 24వ తేదీ సాయంత్రం 6 గంటలకు హరిద్వార్ నుంచి వచ్చిన పురోహితులతో గంగా హారతి ఇవ్వడం జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు .  పై కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ ఈఈలు శేషగిరి రావు, అనిల్ కుమార్, డిఈ సాయి కృష్ణ, హెల్త్ ఆఫిసర్ దినేష్, ఎఈ చంద్రహస్, సింహపురి కార్తీక దీపోత్సవ సమితి సభ్యులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.