BREAKING
రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో కంప్యూటర్ ప్రింటర్ అందజేత ఆత్మకూరు ప్రాదేశిక ప్రతినిధుల ప్రమాణ స్వీకారం రేపే --ఎంపిపి, వైస్ ఎంపిపి ఎన్నిక బియ్యం ధరల కృత్రిమ పెంపు.. అక్రమ నిల్వలపై కొరడా ఝళిపించాలి శ్రీ అలగనాథస్వామి దేవస్థానంలో వైభవంగా కార్తీక ఆకాశ దీపోత్సవం, స్వామివారి కల్యాణ మహోత్సవం ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ నియోజకవర్గంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి - టిడిపి పరిశీలకులు మోహన్ రెడ్డి గోమాతల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత - హనుమాన్‌ గోశాల, క్షత్రియ పాఠశాలలో ప్రత్యేక పూజలు విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా దోమతెరల పంపిణీ - ఆరోగ్య అవగాహన కార్యక్రమం చేయూత పెన్షన్లకు కృతజ్ఞతగా పాలాభిషేకం పొట్లమర్రి పంచాయితీ లో తెదేపా హవా. గంటాపురం పరిధిలో ఆరు వార్డులు ఏకగ్రీవం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి - సోషల్ వెల్ఫేర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వైసిపి ప్రజాప్రతినిధులు ఆశీస్సులు తీసుకున్న జి మధు రెడ్డి పిఎసిఎస్ డైరెక్టర్ ను సన్మానించిన గ్రామస్తులు టీఆర్ఎస్ పార్టీ రైతు కమిటీ అధ్యక్షుడిగా గోవర్ధన్ రెడ్డి

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేతులమీదుగా నూతన పెన్షన్ ఉత్తర్వులు పంపిణీ

Select Suryaa Now
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేతులమీదుగా నూతన పెన్షన్ ఉత్తర్వులు పంపిణీ
సూర్య జమ్మికుంట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పెన్షన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం జమ్మికుంటలోని ఎంపీఆర్ గార్డెన్‌లో జరిగింది.జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులకు 583, జమ్మికుంట మండల పరిషత్ పరిధిలోని 20 గ్రామాలకు కలిపి మొత్తం 553 నూతన పెన్షన్లు మంజూరయ్యాయి.ఈ కార్యక్రమానికి హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ముఖ్య అతిథిగా, హుజూరాబాద్ ఆర్డీవో జల కుమారి నాయక్ వాడి హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ సభాధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల నుంచి ఒక్కొక్క వార్డు నుంచి ఒక లబ్ధిదారుని చొప్పున మొత్తం 30 మందికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆర్డీవో జల కుమారి నాయక్ వాడి, మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ దిలీప్, కమిషనర్ జి. మల్లికార్జున స్వామి చేతుల మీదుగా మంజూరు ఉత్తర్వులు అందజేశారు.
అదే విధంగా మండల పరిషత్ పరిధిలోని 20 గ్రామాల నుంచి ఒక్కొక్క గ్రామం నుంచి ఒక లబ్ధిదారుని చొప్పున 20 మందికి సంబంధిత గ్రామ సర్పంచులు, ఎంపీడీవో ఆర్. పద్మావతి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆర్డీవో జల కుమారి నాయక్ వాడి చేతుల మీదుగా మంజూరు ఉత్తర్వులు అందజేశారు.ఈ కార్యక్రమానికి హాజరైన మండలంలోని 20 గ్రామాల పెన్షన్ లబ్ధిదారులకు, మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల లబ్ధిదారులకు ఎంపీఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో అవసరమైన ఏర్పాట్లను ఎంపీడీవో ఆర్. పద్మావతి, మున్సిపల్ కమిషనర్ జి. మల్లికార్జున స్వామి సమన్వయంతో చేపట్టారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి. రాజిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ ముంతాజ్ అలీ (జావిద్), వార్డు కౌన్సిలర్లు, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది, ఎంపీఓ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.