BREAKING
రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో కంప్యూటర్ ప్రింటర్ అందజేత ఆత్మకూరు ప్రాదేశిక ప్రతినిధుల ప్రమాణ స్వీకారం రేపే --ఎంపిపి, వైస్ ఎంపిపి ఎన్నిక బియ్యం ధరల కృత్రిమ పెంపు.. అక్రమ నిల్వలపై కొరడా ఝళిపించాలి శ్రీ అలగనాథస్వామి దేవస్థానంలో వైభవంగా కార్తీక ఆకాశ దీపోత్సవం, స్వామివారి కల్యాణ మహోత్సవం ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ నియోజకవర్గంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి - టిడిపి పరిశీలకులు మోహన్ రెడ్డి గోమాతల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత - హనుమాన్‌ గోశాల, క్షత్రియ పాఠశాలలో ప్రత్యేక పూజలు విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా దోమతెరల పంపిణీ - ఆరోగ్య అవగాహన కార్యక్రమం చేయూత పెన్షన్లకు కృతజ్ఞతగా పాలాభిషేకం పొట్లమర్రి పంచాయితీ లో తెదేపా హవా. గంటాపురం పరిధిలో ఆరు వార్డులు ఏకగ్రీవం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి - సోషల్ వెల్ఫేర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వైసిపి ప్రజాప్రతినిధులు ఆశీస్సులు తీసుకున్న జి మధు రెడ్డి పిఎసిఎస్ డైరెక్టర్ ను సన్మానించిన గ్రామస్తులు టీఆర్ఎస్ పార్టీ రైతు కమిటీ అధ్యక్షుడిగా గోవర్ధన్ రెడ్డి

కోటంరెడ్డి సోదరులతో భేటీ అయిన మంత్రి ఆనం

Select Suryaa Now
కోటంరెడ్డి సోదరులతో భేటీ అయిన మంత్రి ఆనం

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్  :    నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో  రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంగళవారం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మాగుంట లేఔట్ లోని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాసానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేరుకొని వారితో పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు మూడు విడతలు జరగవలసి ఉండగా, నెల్లూరు నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్ ఎంపిక, జిల్లా ప్రజా పరిషత్ లో  జడ్పీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక జరగవలసి ఉంది. దీంతో మంత్రి ఆనం  రామనారాయణరెడ్డి పలు రాజకీయ అంశాలపై వారితో చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా నగరపాలక సంస్థలో మేయర్ నగర నియోజకవర్గానికి చెందిన వారికి కేటాయించడంతో, డిప్యూటీ మేయర్ ఎవరన్నది ఆసక్తిగా మారింది. డిప్యూటీ మేయర్ పదవి నెల్లూరు రూరల్ కు కేటాయిస్తారని ప్రచారం ఉండడంతో, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఏ అంశంపై చర్చించారనేది తెలియవలసి ఉంది.