BREAKING
రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో కంప్యూటర్ ప్రింటర్ అందజేత ఆత్మకూరు ప్రాదేశిక ప్రతినిధుల ప్రమాణ స్వీకారం రేపే --ఎంపిపి, వైస్ ఎంపిపి ఎన్నిక బియ్యం ధరల కృత్రిమ పెంపు.. అక్రమ నిల్వలపై కొరడా ఝళిపించాలి శ్రీ అలగనాథస్వామి దేవస్థానంలో వైభవంగా కార్తీక ఆకాశ దీపోత్సవం, స్వామివారి కల్యాణ మహోత్సవం ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ నియోజకవర్గంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి - టిడిపి పరిశీలకులు మోహన్ రెడ్డి గోమాతల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత - హనుమాన్‌ గోశాల, క్షత్రియ పాఠశాలలో ప్రత్యేక పూజలు విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా దోమతెరల పంపిణీ - ఆరోగ్య అవగాహన కార్యక్రమం చేయూత పెన్షన్లకు కృతజ్ఞతగా పాలాభిషేకం పొట్లమర్రి పంచాయితీ లో తెదేపా హవా. గంటాపురం పరిధిలో ఆరు వార్డులు ఏకగ్రీవం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి - సోషల్ వెల్ఫేర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వైసిపి ప్రజాప్రతినిధులు ఆశీస్సులు తీసుకున్న జి మధు రెడ్డి పిఎసిఎస్ డైరెక్టర్ ను సన్మానించిన గ్రామస్తులు టీఆర్ఎస్ పార్టీ రైతు కమిటీ అధ్యక్షుడిగా గోవర్ధన్ రెడ్డి

పేదరికం చదువుకు అడ్డు కాదు - ఒకే కుటుంబంలో ముగ్గురు వైద్యులు

Select Suryaa Now
పేదరికం చదువుకు అడ్డు కాదు - ఒకే కుటుంబంలో ముగ్గురు వైద్యులు
సూర్య జమ్మికుంట : ఆర్థిక ఇబ్బందులు, పేదరికం చదువుకు ఏమాత్రం అడ్డుకాదని నిరూపించారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంటకు చెందిన హోంగార్డు ఎస్ కే గౌస్.పోలీస్ శాఖలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న గౌస్ సాధారణ ఉద్యోగం చేస్తూ, పరిమిత ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తూనే తన ముగ్గురు పిల్లలను వైద్యులుగా తీర్చిదిద్దారు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడిని ఉన్నత విద్యావంతులుగా మార్చి తండ్రిగా తన బాధ్యతను గొప్పగా నిర్వర్తించారు.పిల్లల చదువుకు ఎలాంటి లోటు రాకుండా ఎన్నో త్యాగాలు చేశారు. వారి భవిష్యత్తే లక్ష్యంగా ముందుకు సాగారు. తండ్రి కష్టం, త్యాగం, ప్రోత్సాహానికి పిల్లలు తమ ప్రతిభతో ప్రతిఫలం అందించారు.పెద్ద కుమార్తె ఎస్ కే హజారా కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ పూర్తి చేసింది. రెండవ కుమార్తె ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మూడవ సంవత్సరం వైద్య విద్యను అభ్యసిస్తోంది. ఏకైక కుమారుడు నవాజ్ అలీ నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ సీటు సాధించాడు.సంపద ఉంటేనే ఉన్నత శిఖరాలను అధిరోహించగలమనే భావనను పటాపంచలు చేస్తూ, పట్టుదల, కష్టపడే తత్వం, విద్యపై ఆసక్తి ఉంటే పేదరికాన్ని సైతం అధిగమించవచ్చని ఈ కుటుంబం నిరూపించింది.ఒక సాధారణ హోంగార్డు తన ముగ్గురు పిల్లలను వైద్యులుగా తీర్చిదిద్దడం సమాజానికి స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరమవుతున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు గౌస్ కుటుంబం ఆదర్శంగా నిలుస్తోంది. పిల్లల విజయమే తన జీవితానికి అసలైన సంపదగా భావించే ప్రతి తండ్రికి ఈ కథనం ఒక నిదర్శనం.