ధారూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర
వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర మంగళవారం ధారూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ పరిసరాలు, నిర్వహణ,రికార్డులు మరియు పోలీస్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణ, పరిసరాల పరిశుభ్రత, రిసెప్షన్,రికార్డుల నిర్వహణ,వివిధ రిజిస్టర్లు, పెండింగ్ కేసుల వివరాలు, కేసుల దర్యాప్తు పురోగతి తదితర అంశాలను పరిశీలించారు.పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ,వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి విధుల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.నేర నియంత్రణ,శాంతిభద్రతల పరిరక్షణ,రాత్రి గస్తీ, పెండింగ్ కేసుల పరిష్కారం, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంపై పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై బాధ్యతాయుతంగా స్పందించి, బాధితులకు చట్టపరిధిలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రికార్డుల నిర్వహణలో పారదర్శకత, క్రమశిక్షణ, పరిశుభ్రత పాటించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహించాలని సూచించారు.పోలీస్ శాఖపై ప్రజలకు మరింత నమ్మకం కలిగేలా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ధారూర్ సీఐ రఘురాం,ఎస్‌ఐ సురేష్,పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.