BREAKING
స్మోగ్ ముసుగులో ఉత్తర భారతం: నాసా శాటిలైట్ చిత్రాలు రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం ఈనెల 11న సర్దార్ నగర్ లో BJP జెండావిష్కరణ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ ఇందిరమ్మ ఇండ్లు గ్రామసభ ద్వారా ఎంపిక చేయాలి షాబాద్‌లో ఇందిరమ్మ మోడల్ హౌస్ ప్రారంభం వ్యవసాయ భూమిలో మొసలి సంచారం.. గ్రామస్థుల్లో ఆందోళన! కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికపై హర్షం నిమ్మనపల్లికి హెల్త్ సెంటర్, సోలార్ లైట్లు, తాగునీటి బోర్లు మంజూరు చేయాలి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు సర్పంచ్ వేల్పుల రమేష్ వినతి ఓటీటీలో సందడి చేస్తోన్న సందీప్ కిషన్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ప్రాజెక్ట్ జెడ్! కడప సుధాకర్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్న ఎంపిటిసి ధనలక్ష్మీ : కోటకాడపల్లి అభివృద్ధికి కృషిచేయాలని సూచించిన అప్ప ఉపాధి హామీ పనికి శ్రీకారం. కుందుర్పి మండలం లో చిరుత సంచారం. ఈజిప్టు రైలు దుర్ఘటన: రాజకీయ జవాబుదారీతనానికి డిమాండ్

ఈనెల 14 నుండి గ్రంథాలయ వారోత్సవాలు

Select Suryaa Now
ఈనెల 14 నుండి గ్రంథాలయ వారోత్సవాలు

గరుగుబిల్లి, సూర్య : రాష్ట్ర పౌర గ్రంథాలయాల సంచాలకులు (డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్) ఉత్తర్వుల మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆదేశాల మేరకు ఈనెల 14వ తేదీ నుండి గరుగుబిల్లి మండల కేంద్రంలోని శాఖా గ్రంధాలయంలో గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిం చడం జరుగుతుందని శాఖా గ్రంధాల యం నిర్వాహకులు నల్ల మధుసూదన రావు పేర్కొన్నారు.మండల కేంద్రంలోని శాఖా గ్రంధాలయంలో సోమవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు.14 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తు న్నామన్నారు.ప్రజల్లో గ్రంథాలయాలపై అవగాహన కల్పించేందుకు, అదే విధంగా గ్రంధాలయం ద్వారా పాఠకుల కు అందిస్తున్న సేవలను వివరించేందు కు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామ న్నారు.14 వ తేదీన గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం సందర్భంగా బాలల దినోత్సవం కార్యక్రమమును నిర్వహిస్తున్నామన్నారు.15వ తేదీన పుస్తక ప్రదర్శన కార్యక్రమమును నిర్వహించడం జరుగుతుందన్నారు.
16 వ తేదీన వివిధ అంశాలపై ప్రముఖ వ్యక్తలతో ఉపన్యాసాలు ఉంటాయన్నా రు.17 వ తేదీన సదస్సులు,18వ తేదీన విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.19 వ తేదీన మహిళా దినోత్సవం,20వ తేదీన అక్షరాస్యతా దినోత్సవం కార్యక్రమమును నిర్వహిస్తు న్నామన్నారు.గ్రంథాలయ వారోత్సవా లు విజయవంతం చేసేందుకు తగు చర్యలు చేపట్టనున్నామని గ్రంథాల య నిర్వాహకులు నల్ల మధుసూదన రావు తెలిపారు.