BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

దెబ్బతిన్న ఉద్యాన పంటలు పొలాలను పరిశీలించిన అధికారుల బృందం

Select Suryaa Now
దెబ్బతిన్న ఉద్యాన పంటలు పొలాలను పరిశీలించిన అధికారుల బృందం


కోటబొమ్మాళి, అక్టోబరు 31, మేజర్ న్యూస్:

​అర్నాబ్ తుఫాను కారణంగా మండలంలోని నారాయణపురం గ్రామంలో ఉల్లి, టమాటా, మిరప పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పంట పొలాలను పెద్దపేట హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ హెడ్ డా. నరసింహమూర్తి, పార్వతీపురం హార్టికల్చర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా. బి.వి.జి. ప్రసాద్, డా. బి. హరిహరరావు, ఉద్యాన అధికారిణి కే. సునీత, విస్తరణ అధికారిణి బి. ఆమని క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతన్నలకు పలు సస్యరక్షణ సూచనలు చేశారు. ఈ సందర్భంగా రైతులకు పలు జాగ్రత్తలను సూచించారు. దీనిలో భాగంగా పొలాల్లో నిలిచిన అదనపు తుఫాను నీటిని వెంటనే బయటకు పంపించి వేయాలి. నీరు నిలవడం వల్ల వేరు కుళ్ళు, కాండం కుళ్ళు తెగుళ్లు వచ్చే అవకాశం ఉంది. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 1 గ్రాము కార్బండిజమ్ కలిపి మొక్కల మొదళ్లలో పోయాలి (డ్రెంచింగ్ చేయాలి).పోషకాల యాజమాన్యం పంట కోలుకోవడానికి వీలుగా లీటరు నీటికి 10 గ్రాముల 19:19:19 (ఎన్ పి కె) మరియు 1 గ్రాము ఫార్ములా-4 (సూక్ష్మపోషకాలు) కలిపి ఆకులపై పిచికారీ చేయాలి అని సూచించారు.కాగా, తుఫాను వల్ల నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందించేందుకు అధికారులు అంచనాలు రూపొందిస్తున్నామని తెలిపారు