BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

చైతన్య సంస్థలో ఘనంగా పటేల్ జయంతి,ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు

Select Suryaa Now
చైతన్య సంస్థలో ఘనంగా పటేల్ జయంతి,ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు

 

మదనపల్లె,మేజర్ న్యూస్ : చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉక్కుమనిషి,భారతదేశ తొలి ఉపప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి,భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి,ఐరన్ లేడీ ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ జనరల్ సెక్రటరీ ఏ.కవితా రాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్,ఇందిరాగాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఏ.కవితా రాణి మాట్లాడుతూ,దేశ ఐక్యతే మహాబలమని విశ్వసించి,సంస్థానాల విలీనంతో భారతదేశ సమగ్రతకు పునాది వేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.ఆయన దృఢ సంకల్పానికి, దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ప్రపంచ ప్రఖ్యాత స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గురించి పిల్లలకు వివరించారు.అదేవిధంగా ఇందిరాగాంధీ ధైర్యసాహసాలు,దృఢమైన నాయకత్వ లక్షణాలు,దేశాభివృద్ధికి ఆమె చేసిన సేవలను వివరిస్తూ,మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ఆమె జీవితం ఒక గొప్ప స్ఫూర్తి అని తెలియజేశారు.అనంతరం సంస్థ కోశాధికారి పి.గిరిజమ్మ మాట్లాడుతూ దేశం కోసం జీవితాలను అంకితం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని,వారి ఆశయాలను నేటి తరం విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వై.జనార్ధన్,సి.ఆర్.రెడ్డి,ప్రసన్న,టి.భార్గవి తదితరులు పాల్గొని సర్దార్ వల్లభాయ్ పటేల్,ఇందిరాగాంధీల జీవిత విశేషాలను పిల్లలకు వివరించారు.విద్యార్థులు కూడా తమ ప్రసంగాల ద్వారా మహనీయుల దేశభక్తిని,సేవా స్ఫూర్తిని కొనియాడుతూ ఘనంగా నివాళులర్పించారు.ఐక్యత,ధైర్యం,నాయకత్వం,దేశభక్తి వంటి విలువలను బాల్యంలోనే విద్యార్థుల్లో పెంపొందించడమే ఇటువంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి