బి.ఎస్.పి అభ్యర్థిని పురుషోత్తంను కలిసిన బి.ఎస్.పి నాయకులు అశోక్
ఇరగవరం సూర్య న్యూస్:పెనుగొండ బి.ఎస్.పి జడ్పీటీసీ అభ్యర్థి కడలి పురుషోత్తంను బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు,పశ్చిమ గోదావరి జిల్లా ఎలక్షన్ ఇంచార్జ్ ఏలూరి అశోక్ కుమార్ కలిసి తమ సంపూర్ణ మద్దత్తు తెలియజేసారు.రాబోయే జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎలక్షన్ లో జడ్పీటీసీ అభ్యర్థి కడలి పురుషోత్తం పెనుగొండ-2 ఎంపీటీసీ అభ్యర్థి కొక్కిరి రవిని అత్యధిక మెజారిటీ తొ గెలిపించాలని అశోక్ కుమార్ కోరారు. దేశంలో అతి పెద్ద 3 వ జాతీయ పార్టీ అయిన బహుజన సమాజ్ పార్టీని బహుజన వర్గాలు అర్ధం చేసుకుంటే తిరుగు లేని శక్తిగా ఎదుగుతాం అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని రాబోయే రోజుల్లో బహుజన సమాజ్ పార్టి కేంద్రంలో అధికారంలోకి వస్తే నూటికి 86శాతం ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం లోవై.ఎన్ ప్రసాద్,కె.లోకేష్ తదితరులు పాల్గొన్నారు.