అవినీతి నిర్మూలనలో యువత పాత్ర ప్రధానమైనది
అవినీతి నిర్మూలనలో యువత పాత్ర ప్రధానమైనది
ఎసిబి డిఎస్పీ జి వి కృష్ణారావు
ఏలూరు, మేజర్ న్యూస్: సమాజంలో ఎక్కడ అవినీతి సంఘటన జరిగినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ జి.వి. కృష్ణారావు చెప్పారు. విజిలెన్స్ వారోత్సవాలలో భాగంగా ఏలూరులోని సెయింట్ జేవియర్ పాఠశాలలో శుక్రవారం అవినీతి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ సమాజిభివృద్దికి ఆటంకంగా ఉన్న అవినీతిని నిర్మూలనలో యువత పాత్ర ప్రధానమైనదన్నారు. సమాజంలో ఎక్కడ అవినీతి జరిగినా అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1064 లేదా 9440446157, 9440446158, 9440446159 ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదీదారుని వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. సమాజంలో అవినీతిని రూపుమాపడం కోసం అవినీతి నిరోధక శాఖ కళాశాలల స్థాయిలో విద్యార్థులకు, ప్రభుత్వ కార్యాలయాలలోను , వివిధ రంగాలలోని ప్రజలకు విస్తృత అవగాహనకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నదన్నారు. ప్రజలకు కరపత్రాల ద్వారా ప్రముఖ కూడళ్లలో గోడ పత్రికల ద్వారా అవగాహన నిర్వహిస్తున్నామన్నారు. సమాజంలో అవినీతిని రూపుమాపడం ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా అవినీతి నిర్మూలనపై ముద్రించిన ,గోడప్రతులు, కరపత్రాలను పాఠశాలలో పంపిణీ చేసారు. ఈ సందర్భంగా విద్యార్థులతో అవినీతి నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు.
అవినీతి నిరోధక శాఖ ఇన్స్పెక్టర్ కె. శ్రీనివాసు, సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.