BREAKING
వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ ఓటీటీ రిలీజ్ డేట్.. డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలివే ఎల్‌నినో ముప్పును ముందుగానే అంచనా వేసి.. నీటి భద్రతకు జిల్లా సమగ్ర కార్యాచరణ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల కిటకిట: - స్వయంగా ఏర్పాట్లను పరిశీలించిన ఈవో ఆర్టీసీ బస్సు ప్రారంభించిన సర్పంచ్ పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి: అమీనుద్ధీన్, భాగ్యానంద్ ఖాకీ నిఘాపై దొంగల"చెయ్యి"- రాజీవ్‌ రహదారిపై రెచ్చిపోయిన స్నాచర్లు అమిత్ షా రాకతో కాంగ్రెస్ లో గుబులు.... సింగరేణిలో రూ.330 కోట్ల సోలార్ ప్లాంట్ లకు గ్రహణం...!!! ఘనంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జన్మదిన వేడుక మేము సైతం సోమాజిగూడలో పట్టభద్రుల ఓటరు నమోదు కోసం ఇంటింటి ప్రచారం.... నిస్వార్థ ఉద్యమకారుడిని కోల్పోయాం.. పీటీ స్వామి సేవలు చిరస్మరణీయం! ఏకగ్రీవంగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఎన్నిక అధ్యక్షుడిగా ఎ. శ్రీనివాస్ , ఉపాధ్యక్షుడు గా ముఖ్తార్ అహ్మద్ సైబర్ నేరాల పట్ల అవగాహన ఉండాలి పూల్స్‌లో అజేయంగా నిలిచిన టైగర్స్ మరియు ఆర్టిస్ట్స్ - హెచ్‌పిఆర్‌సి అరీనా పోలో టోర్నమెంట్ 2026

అద్దంకి మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం.

Select Suryaa Now
అద్దంకి మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం.

సూర్య న్యూస్ అద్దంకి.

అద్దంకిలో మున్సిపల్ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. మున్సిపల్ పరిధిలోని మొత్తం 32 వార్డులకు గాను 49 పోలింగ్ బూత్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను అధికారులు సమకూర్చారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ బాలమురళీకృష్ణ నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఉదయం 11 గంటల సమయంలో పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేశారు. బందోబస్తు పరిశీలించారు. మొత్తం 31,895 మంది ఓటర్లకు గాను 9 గంటల సమయానికి 10.33 శాతం,11 గంటల సమయానికి 30.28 శాతం, మధ్యాహ్నం ఒంటిగంటకు 56.70 శాతం, మూడు గంటలకు 68 శాతం పోలింగ్ కాగా సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి 25,491 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 79.92 శాతంగా నమోదయింది.