ఆత్మకూరులో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ - 73.09 శాతం మంది ఓటు హక్కు వినియోగం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో ఆదివారం జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరిగింది. 73.09శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపాలిటీలో మొత్తం 26,529 మంది ఓటర్లు ఉండగా 19389 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 28 వార్డులు కాగా 30 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 230 మంది సిబ్బందిని 250 మంది పోలీసులను ఎన్నికల విధులకు నియమించారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగగా స్వల్ప వాదోపవాదాలు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 7 గంటలకు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ప్రారంభం కాగా 9 గంటల వరకు కాస్త మందకొడిగా పోలింగ్ జరిగి 13.38శాతంగా నమోదయింది. 10 గంటలకు 21.45శాతం,11 గంటలకు 28.18శాతం, 12 గంటలకు 36.8శాతం,మధ్యాహ్నం ఒక గంటకు 45. 23శాతం, రెండు గంటలకు 52.58 శాతం, మూడు గంటలకు 58.75శాతం, నాలుగు గంటలకు 66.51శాతం పోలింగ్ నమోదు కాగా ఐదు గంటలకు పోలింగ్ ముగిశాక మొత్తం 19389 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో 73.09శాతం పోలింగ్ నమోదయింది. ఒకటవ వార్డులో 72.9శాతం, రెండో వార్డులో 87.33శాతం, మూడో వార్డులో 57.86శాతం, నాలుగో వార్డ్ లో 70.66శాతం, ఐదో వార్డులో 61.50శాతం, ఆరో వార్డులో 70.90శాతం,ఏడో వార్డులో 73.99శాతం, 8వ వార్డులో 77.66శాతం, తొమ్మిదో వార్డులో 85.72శాతం, పదో వార్డులు 60.37శాతం, 11వ వార్డులో 77.50శాతం, 12 వ వార్డులు 69.05శాతం, 13వ వార్డులో 69.40శాతం, 14వ వార్డులో 65.78శాతం, 15వ వార్డులో 83.45శాతం, 16వ వార్డులో 75.09శాతం, 17వ వార్డులో 73.2 0శాతం, 18 వ వార్డులో 74.04శాతం, 19వ వార్డులో 74.65శాతం, 20వ వార్డులో 76.72శాతం, 21వ వార్డులు 67.82శాతం, 22వ వార్డులో 74.69శాతం, 23వ వార్డులో 67.22శాతం, 24 వ వార్డులో 62.51శాతం, 25 వార్డులో 77.26శాతం, 26వ వార్డులో 81.04శాతం, 27వ వార్డులో 89.44శాతం, 28వ వార్డులో 68.39శాతం పోలింగ్ నమోదయింది. అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు మధ్య పోలింగ్ నిర్వహించారు. పలు పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పరిశీలించి ఎన్నికల సరళిని గమనించారు. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆ పార్టీ నాయకులతో కలిసి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్స్ లను అధికారులు సిబ్బంది కౌంటింగ్ కేంద్రానికి చేరవేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.