ఆసం ఆహ్వానం మేరకు గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి, ఎమ్మెల్యే
ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:
పట్టణంలో నూతన ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి గంగమ్మ దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి ఆహ్వానం మేరకు గంగమ్మ దేవాలయం వీధిలోని ఆలయానికి చేరుకున్న వారు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, ఇతర నాయకులను ఆలయ నిర్వాహకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.
- ఎ ప్రతాప్ కుమార్ ప్రొద్దుటూరు అర్బన్ వైఎస్సార్ కడప జిల్లా