|
|
by Suryaa Desk | Mon, Sep 29, 2025, 08:16 AM
ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జగర్లముడి దర్శకత్వంలో అనుష్క శెట్టి మరియు విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలలో నటించిన 'ఘాటీ' చిత్రం సెప్టెంబర్ 5న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదల అయ్యిన అన్ని చోట్ల మిశ్రమ సమీక్షలని అందుకుంటుంది. ఈ చిత్రంలో చైతన్య రావు, జగపతి బాబు, రావేంద్ర విజయ్ మరియు జాన్ విజయ్ ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ప్రసారానికి అందుబాటులోకి వచ్చినట్లు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. యువి క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రంలో నాగవెల్లి విద్యా సాగర్ స్వరపరిచిన సంగీతాన్ని కలిగి ఉంది.
Latest News