యువ సంవాద్ – వికసిత్ భారత్
మహేశ్వరం : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ 2047 సంకల్పంలో భాగంగా, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు గణేష్ పిలుపు మేరకు, బీజేవైఎం మునావత్ దేవేందర్ నాయక్ ఆధ్వర్యంలో బుధవారం మహేశ్వరం మండలం కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మోడల్ జూనియర్ కళాశాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో యువ సంవాద్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేవైఎం రంగారెడ్డి జిల్లా గ్రామీణ అధ్యక్షులు బుర్ర అభినయ్ గౌడ్ ముఖ్య వక్తగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..విద్యార్థులతో ముఖాముఖి సంభాషిస్తూ, వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువత పాత్ర, దేశ అభివృద్ధిలో యువత బాధ్యతలు, భవిష్యత్ భారత నిర్మాణంలో యువతకు ఉన్న అవకాశాలు మరియు యువత ఆలోచనలను పంచుకున్నారు.
యువత విద్య, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలతో ముందుకు సాగుతూ, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు మునావత్ దేవేందర్ నాయక్, శివ కుమార్, మణి కుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.