పల్లపు ప్రాంతాలు జలమయం అల్లాడుతున్న ప్రజలు
అయినవిల్లి మేజర్ న్యూస్ :గత రెండు రోజులుగా కోనసీమ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన తుఫాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావం కోస్తా జిల్లాలపై తీవ్రంగా ఉంది ముఖ్యంగా అయినవిల్లి మండలంలో నేదునూరు అయినవిల్లి కే జగన్నాధపురం గ్రామాల్లో గృహాలు పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి ప్రజలు బిక్కుబిక్కుమని కాలక్షేపం చేస్తున్నారు ఇప్పటికే ఆర్నా తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులు ప్రస్తుతం కొనసాగుతున్న మురసు తుఫాను కారణంగా ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు ఇళ్లలోంచి బయటికి రాలేని పరిస్థితిలు ఏర్పడ్డాయి కోనసీమలోని కొబ్బరి అరటి తోటలు పూర్తిగా ధ్వంసం అవ్వగా ఇప్పుడు గృహాల సైతం నీరు చేరుకోవడంతో గ్రామాల్లో దయనీయ పరిస్థితుల నెలకొన్నాయి
ఎన్నికల్లో నిమగ్నమైన యంత్రాంగం
ఒకపక్క ఆర్నా తుపానులతో ఊపిరాడక ఇబ్బందులు పడుతున్న గ్రామీణ ప్రజానీకానికి ఎన్నికలు ఇబ్బందులుగా మారాయి ఒకపక్క వర్షాలు ఒకపక్క ఎన్నికలు ప్రజలను ఇబ్బందులకు గురిచేశాయి గ్రామాల్లో ప్రజలకు సహాయ చర్యలు అందక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు తుఫాను కారణంగా ఇంతవరకు ప్రజలకు ఏ విధమైన సహాయాలు అందలేదు ఐదో తారీఖున జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలు జరగనున్నందున పూర్తి ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉండటం ఏ విధమైన సహాయ కార్యక్రమాలు అందడం లేదని ప్రజలు గొగ్గులు పె డుతున్నారు
ఆక్రమణ కారణంగా చెరువులుగా మారిన గ్రామాలు
ఎన్ని ప్రభుత్వాలు మారినా
మురుగు దిగే డ్రైన్లు రోడ్లు ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి ప్రజలకు ఇబ్బందులు కలుగ చేస్తున్నప్పటికీ ఆక్రమణదారులపై ఏ విధమైన చర్యలు తీసుకోలేకపోతున్నారు ప్రస్తుతం ఏర్పడిన వరుస తుఫానులు కారణంగా గ్రామాల్లో నీరు దిగే మార్గాలు లేక నీరు పాడై వ్యాధులు ప్రబులుతున్నాయి మురుగునీటిలోనే కాలక్షేపం చేస్తున్నారు అయినవిల్లి మండలం తోత్తరమూడి కే జగన్నాధపురం గ్రామాలలో మురుగునీటి పరిస్థితి మరీ దయనీయంగా మారింది ప్రభుత్వం పట్టించుకోవటంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు ప్రభుత్వం యుద్ధ పాతికబడిన మురుగు నీటి ఆక్రమణలను తొలగించి మురుగునీరు పారేలా చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుతున్నారు