వివాహనికి హాజరైన బీఆర్ఎస్ నాయకులు*
*సూర్య,అశ్వారావుపేట :* అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని పేరాయిగూడెం గ్రామానికి చెందిన జుజ్జరపు వెంకటేశ్వరరావు - సునీత దంపతుల కుమారుడు సాయి తేజ - జాహ్నవి వివాహ వేడుకల్లో అశ్వారావుపేట మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు కాసాని చంద్రమోహన్ - పద్మ, 14వ వార్డు కౌన్సిలర్ డా. ఉదయ జ్యోతి - డా. ప్రసాద్, వగ్గెల్ల పూజ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.అనంతరం నూతన దంపతులకు చిరుకానుకను అందజేసి, వారి వైవాహిక జీవితం ఆనందంగా, అన్యోన్యంగా సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట బీఆర్ఎస్ నాయకులు జుజ్జరపు శ్రీరామమూర్తి, జుజ్జరపు రాంబాబు, జిమ్మిగూడెం మాజీ సర్పంచ్ కొండయ్య, నవీన్, రాజనాల గంగాధర్, పండు తదితరులు పాల్గొన్నారు.
సూర్య రిపోర్టర్ మునీర్ ఆర్ సి అశ్వరావుపేట