BREAKING
నామినేషన్ కేంద్రాలు పరిశీలన ప్రజావాణికి మూడు దరఖాస్తులు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. :టీయూడబ్ల్యూజే–ఐజేయూ నాయకుల విజ్ఞప్తి. : తీవ్ర వాయుగుండంపై సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష వివాహనికి హాజరైన బీఆర్ఎస్ నాయకులు* మీడియా రంగంలో చెరగని ముద్ర వేసిన అక్షర యోధుడు రామోజీరావు ఏజెంట్ల మాయమాటలకు బలి.. మలేషియా జైల్లో తెలుగు బిడ్డల నరకయాతన - వైసీపీ నేతల అవినీతి అక్రమాలపై వెబ్ సిరీస్ తీస్తే దానికి అంతం ఉండదు మంత్రి కొల్లు రవీంద్ర కార్తీక వనంలో మైత్రి పరిమళం...! పదో తరగతి పబ్లిక్ పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్ ప్రవేశాలను ప్రోత్సహించాలి: అసిస్టెంట్ కమిషనర్ లాజరు... ఇవాళ తుఫాన్‌గా బలపడనున్న వాయుగుండం! ..19న మచిలీపట్నం సమీపంలో తీరం దాటే ఛాన్స్.. గంటకు 145 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు కోటి సోమవారం వేళ శోభాయమానంగా ‘శ్రీగిరి గిరిప్రదక్షిణ’ సింగరాయకొండ కూటమి సర్పంచ్ అభ్యర్ధి సంధాని భాష నామినేషన్‌ సమగ్ర జనగణన చేపట్టండి కక్కలపల్లి కాలనీ సర్పంచ్ అభ్యర్థులుగా వైసీపీ మద్దతుదారుల నామినేషన్

కోటి సోమవారం వేళ శోభాయమానంగా ‘శ్రీగిరి గిరిప్రదక్షిణ’

Select Suryaa Now
కోటి సోమవారం వేళ శోభాయమానంగా ‘శ్రీగిరి గిరిప్రదక్షిణ’

ఒంగోలు, మేజర్‌న్యూస్‌: 
ప్రతి నెలా శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం సందర్భంగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే ‘శ్రీగిరి గిరిప్రదక్షిణ’ మహోత్సవం, ఈసారి పరమపవిత్రమైన కార్తీక దామోదర మాసం, శుద్ధ సప్తమి ‘కోటి సోమవారం’ పర్వదినాన కన్నులపండువగా సాగింది. శ్రీగిరి గిరిప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఉత్సవంలో భాగంగా తొలుత శ్రీగిరి పాదపీఠం వద్ద ఉన్న బాపూజీ గోశాలలో ప్రత్యేక గోపూజ నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువుదీర్చారు. భక్తులు తమ భుజాలపై స్వామివారి పల్లకిని మోస్తూ, దివ్యమైన ‘గోవింద’ నామస్మరణ నడుమ భక్తిపారవశ్యంతో గిరిప్రదక్షిణను కొనసాగించారు.
కోటి సోమవారం పర్వదినం కావడంతో గిరిప్రదక్షిణ మార్గంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ప్రదక్షిణ మార్గంలోని గృహస్తులందరూ తమ ఇళ్ల ఎదుట ముగ్గులు వేసి, స్వామివారి ఉత్సవమూర్తులకు మంగళహారతులు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గిరిప్రదక్షిణ అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.
శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో, అందులోనూ అత్యంత మహిమాన్వితమైన కోటి సోమవారం నాడు శ్రవణా నక్షత్రం కలిసిరావడం, ఆ రోజున గిరిప్రదక్షిణ నిర్వహించడం శ్రీవారి విశేష అనుగ్రహమని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ పవిత్ర దినాన స్వామివారి దర్శనం, దీపారాధన చేయడం వల్ల కోటి సోమవారాల పుణ్యఫలం లభించిందని పేర్కొన్నారు.
ఈ మహోత్సవ ఏర్పాట్లను శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ సేవా భక్తులు అచ్యుత పూర్ణచంద్రరావు - లక్ష్మీ సుభాషిణి దంపతులు, తుమ్మపూడి బుచ్చిబాబు - శేషు కుమారి దంపతులు, గ్రంధి సుధీర్ - లలితా శ్రావణి దంపతులు, ఆలపాటి విష్ణువర్ధన్ రావు - లక్ష్మీ దంపతులు, బొమ్మిశెట్టి వెంకటేశ్వరరావు - సుజాత దంపతులు, పెనుగొండ శ్రీనివాస రావు, తాతా రామకృష్ణ పర్యవేక్షించారు.
శ్రీగిరి గిరిప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం, సహకార్యదర్శి నేరెళ్ల శ్రీనివాసరావు, కోశాధికారి వలేటి కృష్ణారావు, కార్యవర్గ సభ్యులు కనమర్లపూడి బాల కోటేశ్వరరావు, ధనిశెట్టి రామునాయుడు, దోగిపర్తి మల్లికార్జున రావు తదితరులు కార్యక్రమంలో పాల్గొని సేవలందించారు.