ప్రజావాణికి మూడు దరఖాస్తులు
సూర్య రాజంపేట ; రాజంపేట మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి మూడు దరఖాస్తులు స్వీకరించారు. ఈ మూడు దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినవి కావడంతో, త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు పంపించినట్లు నోడల్ అధికారి, ఎంపీడీవో బి. సూర్యాజీ రావు తెలిపారు. కార్యక్రమంలో 16 మంది మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.