నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గం, అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నూతన చేయూత పెన్షన్ల పంపిణీ జరిగింది.ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మండలంలోని లబ్ధిదారులకు పెన్షన్ల మంజూరు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూపేదల సంక్షేమానికే ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పెన్షన్ ఆర్థిక భరోసా అవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పొదిలి జ్యోతి, పర్సా వెంకట్, వనమా గాంధీ, భానోత్ భీముడు, వేముల రమణారావు, ఎంపీడీవో రాజేశ్వరి, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.
సూర్య మేజర్ న్యూస్ /అన్నపురెడ్డిపల్లి...