హిందూపురం ఇందిరా పార్క్ లో నూతన పనులకు శ్రీకారం
ఇందిరా పార్కు అభివృద్ధికి రూ.15.50 లక్షలు..
హిందూపురం టౌన్ మేజర్ న్యూస్:
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు పట్టణంలోని ఆబాద్ పేటలో ఉన్న ఇందిరా పార్కు అభివృద్ధి మరియు పునరుద్ధరణ పనులను సి ఎస్ ఆర్ నిధుల ద్వారా రూ.15.50 లక్షల వ్యయంతో పనులు ప్రారంభమయ్యాయి. నిధులను ఎమ్ ఎస్ టిఎన్ఎంఆర్ ప్రాజెక్ట్స్ సంస్థ వారు సమకూర్చటం జరుగుతున్నదని
ఈ సందర్భంగా పార్కులో పాడైపోయిన చిల్డ్రన్ ప్లే ఇక్విప్మెంట్స్ రిపేరీ మరియు కొత్తవి ఏర్పాటు, ప్రహరీ గోడ పునరుద్ధరణ, రంగులు వేయడం, వాకింగ్ ట్రాక్ మరమ్మతులు, ఫౌంటెన్ రిపేరీ, పచ్చదనం పెంపొందించేందుకు మొక్కలు నాటడం, ఓపెన్ జిమ్ లోని పరికరాలకు మరమ్మతులు చేపట్టి రంగులు వేయడం మొదలైన పనులు చేపట్టడం జరుగుతున్నదని
ఈ పనుల పురోగతిని ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున పరిశీలించారు. ఈ పనులు ఒక 3-4 వారాల్లోపు పూర్తిచేసి పట్టణ ప్రజలకు ఇందిరా పార్కును అందుబాటులోకి తీసుకొని రావాలన్న ఎమ్మెల్యే సూచనల మేరకు పనుల పురోగతిని పరిశీలించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
నేటి దినపత్రిక సూర్య హిందూపురం టౌన్ రిపోర్టర్ నాగరాజు..