BREAKING
పెన్షన్ల మంజూరుపై కాంగ్రెస్ శ్రేణుల హర్షం ఇండో కౌంట్ షేర్లకు 'బై' రేటింగ్: 31% అప్‌సైడ్ అంచనా వేసిన డోలట్ క్యాపిటల్! హైదరాబాద్‌లో 'డిజిటల్ అరెస్ట్' కలకలం.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగినికి రూ. 1.42 కోట్ల టోకరా Q2 ఫలితాల జోరు: మోతీలాల్ ఓస్వాల్ 25 టాప్ స్టాక్ పిక్స్! అల్లూరు నగర పంచాయతీ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ.. ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాని వైనం! వినాయక స్వామి కుంభాభిషేకం లో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి వినాయక స్వామి కుంభాభిషేకం లో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి ప్రజావాణికి రెవెన్యూ శాఖకు సంబంధించి ఒక దరఖాస్తు భీమన్న విగ్రహ ప్రతిష్ఠాపనకు ఎమ్మెల్యేకు ఆహ్వానం - రూ.51 వేల విరాళం అందజేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వైఎస్ఆర్సిపి లో 50 కుటుంబాలు చేరిక గ్రౌండ్ లెవెలింగ్ పనులు దాదాపు పూర్తి.. పలుమార్లు వాటరింగ్ చేయాలని కలెక్టర్ ఆదేశం ఉరేసుకుని యువకుని ఆత్మహత్య శ్రీ సిద్ధి టోంకిని హనుమాన్ 25వ మహా పాదయాత్రకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత సహాయక ఉపకరణాలు ది ఒడిస్సీలో రాబర్ట్ ప్యాటిన్సన్ నటనకు బెన్ అఫ్లెక్ ఫిదా.. ఆసక్తికర విశేషాలు పంచుకున్న మ్యాట్ డామన్!

అల్లూరు నగర పంచాయతీ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ.. ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాని వైనం!

Select Suryaa Now
అల్లూరు నగర పంచాయతీ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ.. ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాని వైనం!
నెల్లూరు (అల్లూరు): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అల్లూరు నగర పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తం 23 వార్డులకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, ఇప్పటివరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అల్లూరును నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ చేయడాన్ని స్థానిక గ్రామస్తులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

నగర పంచాయతీగా మారడం వల్ల తమపై పన్నుల భారం విపరీతంగా పెరుగుతుందని, గ్రామీణ ఉపాధి హామీ వంటి సంక్షేమ పథకాలకు దూరమవుతామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు నగర పంచాయతీ వద్దు, తిరిగి గ్రామ పంచాయతీ హోదానే కొనసాగించాలనే ప్రధాన డిమాండ్‌తో నామినేషన్ల స్వీకరణ మొదటి రోజు నుంచే గ్రామస్తులు ఆందోళనలకు దిగారు. పార్టీలకతీతంగా ఏ ఒక్కరూ నామినేషన్లు వేయవద్దంటూ గ్రామస్తులు, స్థానిక నేతలు పిలుపునివ్వడంతో నామినేషన్ల కేంద్రాలన్నీ వెలవెలబోతున్నాయి.
 
కాగా, గతంలో 2021వ సంవత్సరంలో అల్లూరుతో పాటు సమీపంలోని నార్త్ మోపూరు, సింగంపేట గ్రామాలను కలుపుతూ అల్లూరును నగర పంచాయతీగా ఏర్పాటు చేస్తూ అప్పటి గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేశారు. అప్పటి నుంచే ఈ నిర్ణయంపై స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 26న పోలింగ్ జరగాల్సి ఉండగా, తాజా పరిణామాల నేపథ్యంలో అల్లూరు నగర పంచాయతీ ఎన్నికల భవితవ్యం ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.