ఉరేసుకుని యువకుని ఆత్మహత్య
గొట్టిముక్కులుకు చెందిన యువకుడు నత్తి కిరణ్ (25) ఆదివారం సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువకుడు వేరొక కాలనీలోని ఒకరి ఇంట్లోకి వెళ్లి తలుపులు పెట్టుకుని దూలానికి ఉరి వేసుకున్నాడు. ఆ సమయంలో కూర్చున్న ఆ ఇంటి కుటుంబీకులు స్థానికులను పిలిపించి లోనికి ప్రవేశించారు. ఉరేసుకున్న ఆయనను కిందకు దించగా.. అప్పటికే చనిపోయినట్లుగా గుర్తించారు. మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కిరణ్ తండ్రి రాజయ్య పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.