శిశు మందిర్ పునర్నిర్మాణానికి కస్తూరి నాగరాజు హర్షం.
సూర్య మంచిర్యాల:విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు,దేశభక్తి, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించడంలో శిశు మందిర్ విద్యాసంస్థలు విశేష పాత్ర పోషిస్తున్నాయని బీజేపీ 12వ డివిజన్ కార్పొరేటర్, జిల్లా అధికార ప్రతినిధి కస్తూరి నాగరాజు అన్నారు.తన డివిజన్ పరిధిలోని శిశు మందిర్ పాఠశాల పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టడం ఎంతో సంతోషంగా,గర్వంగా ఉందని పేర్కొన్నారు.తాను కూడా శిశు మందిర్ పూర్వ విద్యార్థిని కావడంతో ఈ కార్యక్రమంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు.శిశు మందిర్ విద్యాసంస్థలు విద్యాబోధనతో పాటు విద్యార్థుల్లో క్రమశిక్షణ, సంస్కారం,దేశభక్తి, భారతీయ సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందిస్తున్నాయని అన్నారు.ఇలాంటి విద్యాసంస్థలు సమాజ అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్యతో పాటు భారతీయ విలువలను అందించే శిశు మందిర్ పాఠశాల మరింత అభివృద్ధి చెందాలని కస్తూరి నాగరాజు ఆకాంక్షించారు.