BREAKING
రాచానుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా బండ అంజి యాదవ్ నామినేషన్ గాలి బుడగతో నిర్మించిన వింత ఇంటిలో హాలీవుడ్ స్టార్ రాబర్ట్ డౌనీ జూనియర్ నివాసం! ఏకంగా ఒక గ్రామాన్నే కొనేసి విలాసవంతమైన రాజభవనంగా మార్చిన హాలీవుడ్ స్టార్ జానీ డెప్! ఎలిజబెత్ హోమ్స్ సంచలన డాక్యుమెంటరీ యూ క్యాన్ సీ ఎవ్రీథింగ్ భారత్‌లో విడుదలకు సిద్ధం! సమాజంలో పాత్రికేయుల సేవలు వెలకట్టలేనివి మల్కాపూర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రహరీ గోడల కూల్చివేత శిశు మందిర్ పునర్నిర్మాణానికి కస్తూరి నాగరాజు హర్షం. చెర్లోపల్లి జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బోయ ఎల్లమ్మ డ్రంక్ అండ్ డ్రైవ్‌పై అశ్వారావుపేట పోలీసుల అవగాహన.. తాగి బండి నడిపితే కఠిన చర్యలు అట్టహాసంగా సర్పంచ్ అభ్యర్థిగా వేదావతి నామినేషన్ అట్టహాసంగా సర్పంచ్ అభ్యర్థిగా వేదావతి నామినేషన్ నూతన చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ ములకలేడు గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎం రంగనాథ్ కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక దర్శన యరపతినేని నిఖిల్ ప్రశాంతి నిలయంలో 150 మంది వైద్యులచే వైద్య శిబిరం ప్రారంభం

సమాజంలో పాత్రికేయుల సేవలు వెలకట్టలేనివి

Select Suryaa Now
సమాజంలో పాత్రికేయుల సేవలు వెలకట్టలేనివి

 జిల్లా గ్రంథాలయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం...
విజయనగరం బ్యూరో మేజర్ న్యూస్: 
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా జిల్లా గ్రంథాలయ సేవా సంఘం ఆధ్వర్యంలో సోమవారం నాడు  సంఘం కార్యాలయంలో జాతీయ పత్రికా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సీనియర్ పాత్రికేయులు విజయభాస్కర్, డేవిడ్ రాజు, గాంధీ, జయరాజ్, ప్రసాద్ లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రొంగళి పోతన్న మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో పత్రికల పాత్ర కీలకమని,  అన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం సమాజంలో ఒక బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్న పాత్రికేయుల సేవలు వెలకట్టలేనివని అన్నారు. గ్రంథాలయ సంఘం గౌరవ అధ్యక్షులు నాలుగెస్సులరాజు మాట్లాడుతూ పాత్రికేయుల జీవితం ఎప్పుడూ ఉన్నతమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపకులు అబ్దుల్ రవూఫ్, అధ్యక్షులు కొత్తలి ఎర్నాయుడు, ఉపాధ్యక్షులు కె. దయానంద్, కో ఆర్డినేటర్ వేమలి చైతన్య బాబు, రోడ్ సేఫ్టీ కమిటీ సభ్యులు డాక్టర్. మజ్జి అప్పారావు, కోశాధికారి పి. ఎ. రామరాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాద్ పట్నాయక్, జనార్దనరావు, శ్రీరామమూర్తి, పి. అప్పారావు తదితరులు పాల్గొన్నారు.