BREAKING
కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక దర్శన యరపతినేని నిఖిల్ ప్రశాంతి నిలయంలో 150 మంది వైద్యులచే వైద్య శిబిరం ప్రారంభం జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు జడ్.పి.హెచ్.ఎస్. తాడిమర్రి విద్యార్థి ఎంపిక *పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల మండలం, అయ్యప్ప నగర్ లోని శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం నందు "మండల పూజా మహోత్సవం" సందర్బంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా దేవస్థానము సింహద్వారమునకు ఇరు భారత్-నేపాల్ ప్రయాణం ఇక మరింత సులభతరం ఎన్విడియా ఏఐ చిప్‌ల వివాదం ప్రజల మన్ననలు పొందిన ఎస్సై లోకేష్ కుమార్ కు ఘనంగా వీడ్కోలు. 20, 30 ఏళ్ల యువతలోనూ మధుమేహం ముప్పు: అమోర్ హాస్పిటల్స్ వైద్యుల హెచ్చరిక ప్రజల ఆశీస్సులే మాకు కొండంత బలం. ఎగువ తంబళ్లపల్లె టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా చంద్రగిరి అనురాధ నామినేషన్ దాఖలు తీవ్రంగా గాయపడి కోలుకున్న ఎంపీ హెలెన్ హైన్స్: "నా మనసు కృతజ్ఞతా భావంతో నిండిపోయింది" అంటూ తొలి ప్రకటన చంద్రమౌనేశ్వరి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఎర్ర సముద్రంలో కీలక జలమార్గంపై హూతీల పట్టు.. హరిహర ప్రియమైన కార్తీకం... అభిషేకాల వెనుక ఆధ్యాత్మిక, శాస్త్రీయ రహస్యాలు! పర్యావరణ పరిరక్షకుల హత్యలపై వాటికన్ ఆందోళన...

జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు జడ్.పి.హెచ్.ఎస్. తాడిమర్రి విద్యార్థి ఎంపిక

Select Suryaa Now
జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు జడ్.పి.హెచ్.ఎస్. తాడిమర్రి విద్యార్థి ఎంపిక

తాడిమర్రి సూర్య రిపోర్టర్ బండారు వెంకటేష్  : జడ్.పి.హెచ్.ఎస్. తాడిమర్రి పాఠశాలకు చెందిన విద్యార్థి జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై పాఠశాలకు గర్వకారణంగా నిలిచాడు. నవంబర్ 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ASR జిల్లా పాడేరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-14 బాలబాలికల వాలీబాల్ పోటీల్లో జడ్.పి.హెచ్.ఎస్. తాడిమర్రి పాఠశాలకు చెందిన జి. గోవర్ధన్ అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణ మేడం మాట్లాడుతూ, తమ పాఠశాల విద్యార్థి రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అదేవిధంగా పాఠశాల పీడీ అమరాంజనేయులు మాట్లాడుతూ, జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు నవంబర్ 23 నుంచి 27వ తేదీ వరకు మహారాష్ట్రలోని శిరిడి, అహిల్యానగర్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన జి. గోవర్ధన్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, పీడీతో పాటు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అభినందించారు. జాతీయ స్థాయిలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు