BREAKING
చంద్రమౌనేశ్వరి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఎర్ర సముద్రంలో కీలక జలమార్గంపై హూతీల పట్టు.. హరిహర ప్రియమైన కార్తీకం... అభిషేకాల వెనుక ఆధ్యాత్మిక, శాస్త్రీయ రహస్యాలు! పర్యావరణ పరిరక్షకుల హత్యలపై వాటికన్ ఆందోళన... పశ్చిమాసియాలో అత్యంత ఉద్రిక్త పరిస్థితులు.. నామినేషన్ దాఖలు చేసిన సర్పంచ్ అభ్యర్థి బైరెడ్డి మల్లేశ్వరి ఎమ్మెల్యే కార్యాలయంలోనే బీజేపీ అభ్యర్థిపై దాడి.. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు! బీజేపీ అధ్యక్షుడు శశికుమార్ చంద్రమౌ మౌలేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఇజ్రాయెల్ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత చంద్రమౌనేశ్వరి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు దక్షిణ చైనా సముద్ర ప్రవర్తనా నియమావళిపై ఆసియాన్ , చైనా చర్చలు విఫలం.. ఎన్విడియా తదుపరి సీఈఓగా రెనే హాస్? జెన్సెన్ హువాంగ్ వారసుడిపై టెక్ దిగ్గజం కసరత్తు టీయూడబ్ల్యూజె – ఐజెయు కమిటీలో లక్షెట్టిపేట ప్రెస్ క్లబ్‌కు కీలక పదవులు ! సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ క్యూ2 ఫలితాలు: రూ. 660 కోట్లకు పెరిగిన ఆదాయం, రూ. 81 కోట్ల నికర లాభం నమోదు రూ. 8,415 కోట్ల AT-1 బాండ్ల రద్దు తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన యెస్ బ్యాంక్

నామినేషన్ దాఖలు చేసిన సర్పంచ్ అభ్యర్థి బైరెడ్డి మల్లేశ్వరి

Select Suryaa Now
నామినేషన్ దాఖలు చేసిన సర్పంచ్ అభ్యర్థి బైరెడ్డి మల్లేశ్వరి
పామూరు, మేజర్ న్యూస్ : పామూరు మండలంలోని వగ్గంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ బలపరిచిన బైరెడ్డి మల్లేశ్వరి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. గ్రామంలోని స్వర్ణ గ్రామం వగ్గంపల్లిలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రంలో ఎన్నికల అధికారి డి. మధుసూదన్‌రెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు. గ్రామ టీడీపీ కమిటీ అధ్యక్షుడు బైరెడ్డి వెంకటేశ్వరరెడ్డి (తుఫాన్‌రెడ్డి) సతీమణి మల్లేశ్వరి సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తూ ఎన్నికల ప్రక్రియలో కీలక అడుగు వేశారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆశీస్సులతో ఆమె టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. నామినేషన్ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, హాజరై మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ అభివృద్ధి అధికారి ఇండ్ల హరినారాయణ, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు బైరెడ్డి జయరామిరెడ్డి, బైరెడ్డి వెంకటేశ్వర్లు (తుఫాన్ రెడ్డి), ఎంపీటీసీ ఎలికా కొండమ్మ, రెక్కల రమణారెడ్డి, బైరెడ్డి సుధాకర్‌రెడ్డి, ఎలికా నారాయణ, ఎలికా నాగశేషులు, గంగిరెడ్డి వెంకటరెడ్డి, బైరెడ్డి రమణారెడ్డి,రావి సూరయ్య, పారా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.