ఎమ్మెల్యే కార్యాలయంలోనే బీజేపీ అభ్యర్థిపై దాడి.. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు! బీజేపీ అధ్యక్షుడు శశికుమార్
నరసరావుపేట: నరసరావుపేటలో రాజకీయ దాడులు, బెదిరింపులతో ప్రతిపక్ష అభ్యర్థుల గొంతు నొక్కాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షుడు శశికుమార్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. సోమవారం నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే కార్యాలయంలో 37వ వార్డు బీజేపీ అభ్యర్థి రాచకొండ ప్రసాద్‌పై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా శశికుమార్ మాట్లాడుతూ మున్సిపల్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా 37వ వార్డు బీజేపీ అభ్యర్థి రాచకొండ ప్రసాద్, వల్లేపు కృపారావుతో కలిసి నామినేషన్ ర్యాలీకి బయలుదేరే క్రమంలో టీడీపీ కార్యాలయానికి వెళ్లారని తెలిపారు. అక్కడ కొద్దిసేపటికే గుర్తుతెలియని వ్యక్తి రాచకొండ ప్రసాద్ చేతిలో ఉన్న నామినేషన్ పత్రాలను బలవం తంగా లాక్కొని వెళ్లేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. నామినేషన్ పత్రాలను కాపాడుకునే క్రమంలో రాచకొండ ప్రసాద్‌పై దాడి జరగడంతో నోటికి, చేతులకు తీవ్ర గాయాలయ్యాయని, మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా స్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేయడం నేరమా? నామినేషన్ వేయడానికి వెళ్లిన అభ్యర్థిపై దాడి చేయడం ఏ రకమైన రాజకీయ సంస్కృతి? ఎమ్మెల్యే కార్యాలయం లోనే ఇలాంటి ఘటన జరగడం అత్యంత ఆందోళనకరం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా జరగాలి తప్ప దాడులు, దౌర్జన్యాలతో అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం సిగ్గుచేటు. ఈ దాడికి బాధ్యులైన వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నా మని శశికుమార్ స్పష్టం చేశారు. ఈ ఘటనను రాష్ట్ర బీజేపీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. దాడులు చేసినంత మాత్రాన బీజేపీ అభ్యర్థు ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. బెదిరింపు లకు భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ప్రజాస్వామ్య హక్కుల కోసం, ప్రజల తరఫున మా పోరాటం కొనసాగుతుంది. దాడి జరిగినప్పటికీ 30వ వార్డు నుంచి కూడా నామినేషన్ దాఖలు చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని శశికుమార్ స్పష్టం చేశారు.
మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి..