లింగంపల్లి ఆంజనేయస్వామికి విశేషంగా పూజలు
హొళగుంద, సూర్య ప్రతినిధి::కర్నూలు జిల్లా హొళగుంద మండలం లింగంపల్లి ఆంజనేయ స్వామికి శనివారం విశేషంగా పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు స్వామివారికి పంచామృత అభిషేకం సుప్రభాత సేవ తులసి పూజ మహా మంగళహారతి పూజలను విశేషంగా నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు.భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు తీసుకున్నారు. వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదం అందించారు.
టి.ఉమాపతి సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా